గుండె గది గోడల మాటున ఎవరివో గుసగుసలు చిన్నగా వినపడుతున్నాయి ఎదలోతుల్లో నుండి మరుగున పడ్డ ప్రతిధ్వనులు సన్నగా వినవస్తున్నాయి ఎంత వద్దనుకుని వెనక్కు నెట్టి నా మనసు తెరల మాటున తారట్లాడుతూ తన మాట వినమంటున్నాడు లోపలి మనిషి
మెదడు పొరల మధ్య దాగిన నిన్నటి ఆలోచనలు నెమ్మదిగా చుట్టుముడుతున్నాయి అంతరంగపు అరల లోపల మడిచి పెట్టిన జ్ఞాపకాలు అదేపనిగా అలజడి చేస్తున్నాయి ఎంత లేదనుకుని కళ్ళు మూసినా కళ్ళ కొనల చివరన దోబూచులాడుతూ తనవైపు చూడమంటున్నాడు లోపలి మనిషి
కాలం చీకట్ల మధ్య మసకబారిన నిన్నటి నీడలు విడవకుండావెంటాడుతున్నాయి హదయపు వాకిటలో తచ్చాడుతున్న అంతరాత్మ అదేపనిగా తలుపు తడుతోంది ఎంత కాదనుకుని ముందుకు నడిచిన అడుగడుగున కాళ్లకు అడ్డం పడుతూ తన వైపు రమ్మంటున్నాడు లోపలి మనిషి
మరుపే లేని కాలం కర్మం గత కాలపు తప్పులకు శిక్షలను విధిస్తున్నా ఆత్మవిమర్శే లేని అహంకారపు జీవనాన్ని కొనసాగిస్తూ మనిషనే పదానికి అర్థం తెలియని నా అంతరార్థం అవగతమై తన దారి తాను చూసుకుంటున్నాడు లోపలి మనిషి - ఎదర శ్రీనివాసరెడ్డి సెల్: 7893111985