Sat 31 Jul 21:21:09.354291 2021
Authorization
పల్లవి : ఆనులైను అనగానే ..
ఏ..ఏ..ఏ.. పిల్లలు చదివేనా...
ఆనులైను అనగానే ..ఏ..ఏ..ఏ.. పిల్లలు చదివేనా...
మాష్టారు గొంతు వినగానే మెదడు తుప్పు వదిలేనా..
మాష్టారు గొంతు వినగానే మెదడు తుప్పు వదిలేనా..
ఏమో..ఏమైనాగాని ''ఈ''బడి...ఇడుగడి..
ఆనులైను అనగానే ..ఏ..ఏ..ఏ..
పిల్లలు చదివేనా.....ఆ..పిల్లలు చదివేనా
చరణం : స్మార్టుఫోనుతో తారాటలా.. ల్యాపుటాపుతో సయ్యాటలా
స్మార్టుఫోనుతో తారాటలా.. ల్యాపుటాపుతో సయ్యాటలా
తారాటలా ..సయ్యాటలా.. సయ్యాటలా.. తారాటలా
విద్యలేరావు వినయం లేదు అన్ని మర్చినది నిన్నటి బుర్ర
విద్యలేరావు వినయం లేదు అన్ని మర్చినది నిన్నటి బుర్ర
ఎక్కిరింతలు... ఏషాలు..
పోకడలు... దూకుడులు..
ఏమో ఏమౌనో గాని ''ఈ''శ్రుతి .. అపశ్రుతి...
ఆనులైను అనగానే ..ఏ..ఏ..ఏ..
పిల్లలు చదివేనా.....ఆ..పిల్లలు చదివేనా
చరణం : ఒకరి నెట్టు ఫుల్ స్పీడు.. వేరొకరి నెట్టు ఆఫ్ మోడు ..
ఫుల్స్పీడు.. ఆఫ్మోడు.. ఆఫ్మోడు.. ఫుల్స్పీడు
ఒకరి నెట్టు ఫుల్ స్పీడు.. వేరొకరి నెట్టు ఆఫ్ మోడు
ఒకరి చదువు కొండెక్కే.. వేరొకరి చదువు గుట్టెక్కే ..
ఒకరి ఫోను స్విచ్ఛాఫో.. వేరొకరి సిస్టం హ్యాంగింగో..
గ్రూప్ చాట్లో... పొస్టింగ్లో...
అగచాట్లో... టైం వేస్టింగ్లో..
ఏమో ఏమగునో గాని ఈ కత.. విలవిల..
ఆనులైను అనగానే ..ఏ..ఏ..ఏ.. పిల్లలు చదివేనా...
మాష్టారు గొంతు వినగానే మెదడు తుప్పు వదిలేనా..
ఏమో..ఏమైనాగాని ''ఈ''బడి...ఇడుగడి..
ఆనులైను అనగానే ..ఏ..ఏ..ఏ..
పిల్లలు చదివేనా.....ఆ..పిల్లలు చదివేనా
''సీతామాలక్ష్మి''(1978) చిత్రంలోని
''మావి చిగురుతినగానే'' పాటకు పేరడి.
రచన: ''దేవులపల్లి''
- డా.బి.బాలకష్ణ
9948997983