Sat 14 Aug 23:59:52.751535 2021
Authorization
పల్లవి : నేత : దొంగ బుద్ధి లేని నేతనే నేను
ప్రజ : అబద్ధం అంతా అబద్ధం
నేత : దొంగిలించ లేని సొమ్మే మీది
ప్రజ : అబద్ధం అంతా అబద్ధం
నేత : పాప మనసులాంటి గుణమే నాది
ప్రజ : అబద్ధం
నేత : కాటు వేయ లేని పడగే నాది
ప్రజ : అబద్ధం
నేత : మీ పైన నా ప్రేమ అబద్దమనకూ అనకూ అనకూ
(దొంగ బుద్ధి లేని)
చరణం : నేత : రాజాలను ఎన్నుకునే నసీబు మీది
ప్రజ : అబద్ధం
నేత : మిమ్ము అప్పుల్లో ముంచెత్తు బాధ్యత నాది
ప్రజ : ఇది నిజం
నేత : ఉద్యోగాలు ఇచ్చేటి మాటేమొ నాది
ప్రజ : అబద్ధం
నేత : నీ మాటకు జై కొట్టు సద్యోగం నీది
ప్రజ : ఇది నిజం
నేత : నేలమీద రైతే రాజులు చూడు
ప్రజ : అబద్ధం
నేత : నీ భూమి గుంజుకునే దరిద్రుణ్ణి నేను
ప్రజ : ఇది నిజం
నువు విస్రే ప్రతి పాట తీపి అబద్ధం
మము వంచించాలనే తాపత్రయం గొప్ప వాస్తవం (దొంగ బుద్ధి లేని)
చరణం : నేత : మచ్చనైనా లేని పార్టేమో మాది
ప్రజ : ఆ హ హ అబద్ధం
నేత : మీ వోటు వెనుకనున్న మతలము మాది
ప్రజ : ఆ ఇది నిజం
నేత : త్యాగాలు చేసేటి బ్రతుకేమో మాది
ప్రజ : అహ మళ్ళీ అబద్ధం
నేత : మీ చేతిలోన ఉన్న బ్రతుకేమొ నాది
ప్రజ : అహా ఇది నిజం
నేత : అభివద్ధి పరిచేటి ఐడియాలు మావి
ప్రజ : అబద్దం
నేత : మీరు గొర్రెల్లా ఉంటేనే మోసాలు సాగు
ప్రజ : ఇది నిజం
మీ పైన అభిమానం క్షణకాలం
మన ఇద్దరి మధ్యన అనుభంధం కలికాలం
(దొంగ బుద్ధి లేని)
''పెళ్ళాం ఊరెళితే'' (2003) చిత్రంలోని
'దొండ పండు' లాంటి పాటకు పేరడీ.
రచన : చంద్రబోస్.
- బి.బాలకృష్ణ, 9948997983