Sun 29 Aug 00:58:21.989825 2021
Authorization
ఆఫ్ఘనిస్తాన్ ఆమె దేహమైతే
ప్రతి ఇల్లు తాలిబన్ వశమే
స్వేచ్ఛను హరిస్తూ
చదువుకున్నదైతే
కాస్త మాట్లాడనిస్తే
ఏ పదవో ఆమెను వరిస్తే
ఇంకొక మగవ్యక్తితో మచ్చుకు మాటాడితే
ప్రతి ఇంట్లో హింస ఉంటుంది
తాలిబన్లు వశపరుచుకున్న ఆఫ్ఘాన్నీ
చూడలేక మనం
కన్నీరు కారుస్తున్నం కానీ
మన దేశంలో ప్రతి ఇంట్లో తాళిబన్లు ఉన్నారు
లేరని.. ఉండరని.. పొరపడొద్దు
ఏ దేశాన్ని చూసి అయ్యో అంటున్నమో
ఆ దేశమే కాదు
మా దేశ సరిహద్దులు కూడా సముద్రాలై
ఆమె కన్నీటి తీరాలై సాగుతున్నాయి
చిన్న సంఘంగా వచ్చి
పెద్ద తుఫాను చెలరేగిందనీ
పక్క దేశం మీద
తెగ ఇదిగా జాలి పడతాం కానీ
మత మౌఢ్యం హద్దుమీరి
ఆడదాని ఉనికిని ప్రశ్నార్ధకం
చేస్తున్నారని చర్చించుకుంటున్నాం కానీ
ప్రతీ ఇంట్లో ఆ హద్దులు
ఆ మౌడ్యాలు దుమారం రేపుతూనే ఉన్నారు
రేపటితరాన్ని అయినా బ్రతికించు
అని మొక్కుతున్న ఆప్ఘాన్
ప్రజల్ని చూస్తున్నాం కానీ
భావితరాల్ని గాలికొదిలి
తల్లుల్ని కర్కశంగా హింసించే
తాలిబన్లు ఎందరో మా దేశంలో
సర్వస్వం ఆమె అయినా
ఉన్న బాధ్యతల్ని కాకుండా
లేని హక్కుల్ని కోరుకునే
ప్రతి ఇల్లూ ఇప్పటి అఫ్ఘాన్ దేశమే...
ప్రతి ఇల్లు...
ఆఫ్ఘనిస్తాన్ ఆమె దేహమైతే
ప్రతి ఇల్లు తాలిబన్ వశమే
స్వేచ్ఛను హరిస్తూ
చదువుకున్నదైతే
కాస్త మాట్లాడనిస్తే
ఏ పదవో ఆమెను వరిస్తే
ఇంకొక మగవ్యక్తితో మచ్చుకు మాటాడితే
ప్రతి ఇంట్లో హింస ఉంటుంది
తాలిబన్లు వశపరుచుకున్న ఆఫ్ఘాన్నీ
చూడలేక మనం
కన్నీరు కారుస్తున్నం కానీ
మన దేశంలో ప్రతి ఇంట్లో తాళిబన్లు ఉన్నారు
లేరని.. ఉండరని.. పొరపడొద్దు
ఏ దేశాన్ని చూసి అయ్యో అంటున్నమో
ఆ దేశమే కాదు
మా దేశ సరిహద్దులు కూడా సముద్రాలై
ఆమె కన్నీటి తీరాలై సాగుతున్నాయి
చిన్న సంఘంగా వచ్చి
పెద్ద తుఫాను చెలరేగిందనీ
పక్క దేశం మీద
తెగ ఇదిగా జాలి పడతాం కానీ
మత మౌఢ్యం హద్దుమీరి
ఆడదాని ఉనికిని ప్రశ్నార్ధకం
చేస్తున్నారని చర్చించుకుంటున్నాం కానీ
ప్రతీ ఇంట్లో ఆ హద్దులు
ఆ మౌడ్యాలు దుమారం రేపుతూనే ఉన్నారు
రేపటితరాన్ని అయినా బ్రతికించు
అని మొక్కుతున్న ఆప్ఘాన్
ప్రజల్ని చూస్తున్నాం కానీ
భావితరాల్ని గాలికొదిలి
తల్లుల్ని కర్కశంగా హింసించే
తాలిబన్లు ఎందరో మా దేశంలో
సర్వస్వం ఆమె అయినా
ఉన్న బాధ్యతల్ని కాకుండా
లేని హక్కుల్ని కోరుకునే
ప్రతి ఇల్లూ ఇప్పటి అఫ్ఘాన్ దేశమే...
- సుభాషిణి తోట, 9502818774