Sat 18 Sep 23:22:02.900298 2021 నేనో నదిని ప్రేమించానుఒడ్లు ఒరుసుకుని పారే నదిని -వేల మైళ్ళదాకాతన గలగలలు వినిపించే నదిని -సీతాకోక చిలుకలారంగురంగుల రెక్కలున్న నదిని -గాఢంగా ప్రేమించానుఎన్నో విరహపు రాత్రుల తర్వాతఉన్నట్టుండి ఓ రోజునది నాకో లేఖ పంపిందిప్రేమగా నాలుగు మాటల్ని రాసిందినేనా మాటలకు చేతులిచ్చానుకాళ్లిచ్చానుజిఇంకా తప్తితీరక రెక్కలిచ్చానుగుండెకళ్ళతో అక్షరాల్ని తడుముకున్నపుడల్లానేను ఆకాశమైపోయానుఒక సెలయేరు పట్టుతప్పినా ముందు దొర్లేదాకాఒక స్నేహం నిశ్శబ్దాన్ని బద్దలుకొట్టేదాకాఇప్పటిదాకా -నదే నాకోసంనాలుగు మాటలుగా ప్రవహించిందనుకున్నానుపాలుపోసుకున్నజినా వరికంకుల్లో పంట కాలువ ఒరవడి కనబడిందిబువ్వపువ్వులు ఏరుతుంటేనిష్కల్ముషమైన వాగు నవ్వు వినబడిందినా ప్రేమ వాగు దగ్గరే ఆగిపోయిందని తెలిసిందిఎంత చెప్పినామనసెందుకో సన్న సన్నని పాయలుగా చీలిపోతోందిఇప్పుడొక్కటే ఆశ!నేను ఎదిగి ఎదిగిఓ నదినవ్వాలిఇరువురం చేయీ చేయీ పట్టుకొనిసముద్రంలో ఏకమవ్వాలి.- సాంబమూర్తి లండ, 9642732008 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి