Sat 09 Oct 23:05:38.133863 2021
Authorization
అప్పుడప్పుడు
నీకు తెలియకుండానే
నీది కాని ఒక ప్రదేశంలో
శిలలా పాతుకు పోవాలనుకుంటావు.
నీ కొమ్మలను నీవే నరుక్కొని,
నీ కలలను తాకట్టు పెట్టుకొని,
నీ గమ్యాన్ని నిర్దాక్షిణ్యంగా ఒంటరి పక్షిని చేసి
ఏదో ఉద్దరిస్తున్నట్టు గోడపై అక్షరాలను అలుకుతావు.
నీ చుట్టూ నీవే వలయంగా తిరుగుతూ,
నీకు నీవే మార్మిక రహస్యాలను తవ్వినట్టు భ్రమించుకుంటూ,
సీతాకోకచిలుకల లాంటి కోరికలను చంపుకొని
ముసలి నవ్వులు నవ్వుకుంటావు.
అదేదో నరకం లాంటిది ఉన్నదని,
నీ కోసమే నిర్మించబడిందనే
పిచ్చి నమ్మకాలతో,
వ్యర్థ ఆలోచనలతో,
కాలాన్ని నములుకుంటూ
ఊహల రెక్కలు తొడుక్కొని
ఆకాశాన్ని చుంబించడం నీ అవివేకమే.
లోయలన్నీ నీ పాదాలకిందే ఉన్నట్టు,
మేఘాలు నువ్వే మోస్తున్నట్టు,
భవబంధాలు నీ గుండెలపైనే దొర్లుతున్నట్టు,
ఇంద్రధనస్సును వంచుకొని
భూమికి రంగులు వేస్తున్నట్టు,
నీ ఇల్లే ఒక భూగోళం అనుకుంటూ
కప్పలా బెక బెక అనుకుంటే సరిపోతుందా?
నీ వెనుకనో, పక్కనో,
నీకు దీటుగా నడుస్తున్న నీడలను
ఎందుకు చూడవు?
గతంలో వదిలేసిన కలల పక్షుల
దీన అరుపులను ఎందుకు వినవు?
తప్పులన్నీ మూట కట్టుకొని,
పాచిని శరీరానికి పూసుకొని,
సముద్రమే నీ మీద ఊగుతుందనే మాయను
ఎప్పుడు వదిలేస్తావో?
నువ్వొక తెలివున్న మనిషివని మరిచిపోయి,
ఎవరి కష్టాన్నో తిలకంగా ధరించి,
నీలో రగులుతున్న తేజోవంతమైన జ్వాలను
నీదికాని ప్రదేశంలో ఆర్పుకుంటూ
చివరికి బూడిదే,
నిన్న ఆరిపోయింది దీపం మాత్రమే...
ప్రమిద, ప్రమిదలో చమురు
ఉన్నదనే విషయాన్ని గ్రహించు.
ఇప్పుడు నువ్వు చేయాల్సింది
ఒత్తిని మాత్రమే...
అగ్గి కావాలా? ఇదిగో ఈ పద్యంతో
నీ జీవితపు ఒత్తిని వెలిగించుకో
ది కాని ప్రదేశంలో శిలలా కాకుండా
నీ సొంతమైన కాస్త మట్టిలోనో లేదా ఊపిరిలోనో లేదా కన్నీటిలోనో లేదా నీ అంతర్గత సంఘర్షణలో నుండి పెల్లుబుకిన అక్షరాలలోనో సజీవంగా...
ఎలాంటి అడ్డంకులు, నియంత్రణలు, లక్ష్మణగీతలు, సాంప్రదాయ, సంస్కతి పట్టింపులు లేకుండా స్వేచ్ఛగా ఎగరలేవా?
దుమ్ము పట్టిన నీ రెక్కలను,
బూచిపట్టిన నీ బుర్రను దులుపుకొని
ఒక్కసారి... నీ తల్లి కనుగుడ్ల మీద ప్రసరించే నరాలనో
నీ తండ్రి భుజాలపై పుండునో,
నువ్వే సర్వస్వం అనుకున్న అతని మనసునో చూస్తే తెలుస్తుంది.
అక్కడ యుద్ధం జరగాలి.
నీ ప్రత్యర్థి నువ్వే..
నీది కాని ప్రదేశంలో
అప్పుడప్పుడు
నీకు తెలియకుండానే
నీది కాని ఒక ప్రదేశంలో
శిలలా పాతుకు పోవాలనుకుంటావు.
నీ కొమ్మలను నీవే నరుక్కొని,
నీ కలలను తాకట్టు పెట్టుకొని,
నీ గమ్యాన్ని నిర్దాక్షిణ్యంగా ఒంటరి పక్షిని చేసి
ఏదో ఉద్దరిస్తున్నట్టు గోడపై అక్షరాలను అలుకుతావు.
నీ చుట్టూ నీవే వలయంగా తిరుగుతూ,
నీకు నీవే మార్మిక రహస్యాలను తవ్వినట్టు భ్రమించుకుంటూ,
సీతాకోకచిలుకల లాంటి కోరికలను చంపుకొని
ముసలి నవ్వులు నవ్వుకుంటావు.
అదేదో నరకం లాంటిది ఉన్నదని,
నీ కోసమే నిర్మించబడిందనే
పిచ్చి నమ్మకాలతో,
వ్యర్థ ఆలోచనలతో,
కాలాన్ని నములుకుంటూ
ఊహల రెక్కలు తొడుక్కొని
ఆకాశాన్ని చుంబించడం నీ అవివేకమే.
లోయలన్నీ నీ పాదాలకిందే ఉన్నట్టు,
మేఘాలు నువ్వే మోస్తున్నట్టు,
భవబంధాలు నీ గుండెలపైనే దొర్లుతున్నట్టు,
ఇంద్రధనస్సును వంచుకొని
భూమికి రంగులు వేస్తున్నట్టు,
నీ ఇల్లే ఒక భూగోళం అనుకుంటూ
కప్పలా బెక బెక అనుకుంటే సరిపోతుందా?
నీ వెనుకనో, పక్కనో,
నీకు దీటుగా నడుస్తున్న నీడలను
ఎందుకు చూడవు?
గతంలో వదిలేసిన కలల పక్షుల
దీన అరుపులను ఎందుకు వినవు?
తప్పులన్నీ మూట కట్టుకొని,
పాచిని శరీరానికి పూసుకొని,
సముద్రమే నీ మీద ఊగుతుందనే మాయను
ఎప్పుడు వదిలేస్తావో?
నువ్వొక తెలివున్న మనిషివని మరిచిపోయి,
ఎవరి కష్టాన్నో తిలకంగా ధరించి,
నీలో రగులుతున్న తేజోవంతమైన జ్వాలను
నీదికాని ప్రదేశంలో ఆర్పుకుంటూ
చివరికి బూడిదే,
నిన్న ఆరిపోయింది దీపం మాత్రమే...
ప్రమిద, ప్రమిదలో చమురు
ఉన్నదనే విషయాన్ని గ్రహించు.
ఇప్పుడు నువ్వు చేయాల్సింది
ఒత్తిని మాత్రమే...
అగ్గి కావాలా? ఇదిగో ఈ పద్యంతో
నీ జీవితపు ఒత్తిని వెలిగించుకో
ది కాని ప్రదేశంలో శిలలా కాకుండా
నీ సొంతమైన కాస్త మట్టిలోనో లేదా ఊపిరిలోనో లేదా కన్నీటిలోనో లేదా నీ అంతర్గత సంఘర్షణలో నుండి పెల్లుబుకిన అక్షరాలలోనో సజీవంగా...
ఎలాంటి అడ్డంకులు, నియంత్రణలు, లక్ష్మణగీతలు, సాంప్రదాయ, సంస్కతి పట్టింపులు లేకుండా స్వేచ్ఛగా ఎగరలేవా?
దుమ్ము పట్టిన నీ రెక్కలను,
బూచిపట్టిన నీ బుర్రను దులుపుకొని
ఒక్కసారి... నీ తల్లి కనుగుడ్ల మీద ప్రసరించే నరాలనో
నీ తండ్రి భుజాలపై పుండునో,
నువ్వే సర్వస్వం అనుకున్న అతని మనసునో చూస్తే తెలుస్తుంది.
అక్కడ యుద్ధం జరగాలి.
నీ ప్రత్యర్థి నువ్వే..
- అఖిలాశ,
బెంగుళూరు, 7259511956