Sat 16 Oct 22:43:16.902364 2021 కనులు నింగికి అతుక్కునిఅడుగులు మాత్రంభూమిలో ఉంటాయి ఆదర్శం పెదవిపై ఉంటుంది ఆచరణ మాత్రం శూన్యమై దర్శనమిస్తుందితేనెలో మునకలేస్తూ మాటలువెన్నులో దిగుతూ కత్తులుమాటకూ చేతకూఎక్కడా పొసగదుమేకవన్నెపులులివి కన్నీళ్ళ నదులు ప్రవహిస్తుంటాయి కరగని గుండెలు పక్కనే నడుస్తుంటాయి నిరాశలో మునుగుతుంది ఒంటరితనం ఒక సాంత్వన కోసం ఆరాటపడుతూచల్లని చెట్టు నీడకైపరుగులు తీస్తూఎడారిగుండెలు చినుకులకై ఎదురుచూస్తుంటాయిఆశ నిరాశల మధ్యఒక ఊగిసలాట ఉంటుందిఅలాగే జీవితం నెట్టుకొస్తూ ముఖాలు సుడిగుండాలను ఎదురీదుతుంటే గమ్యానికి చేరువలో ఒక వెలుగుదివ్వె పిలవకమానదుఏదేమైనామిణుకుమంటున్న ఆశాదీపంవెలుగుతూనే ఉండాలికలల రెక్కలు విప్పుకునిఎగురుతూనే ఉండాలిమనసంతా వెన్నెలకురుస్తూనే ఉండాలి - పద్మావతి రాంభక్త, 9966307777 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి