Sat 16 Oct 23:06:41.944839 2021 కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్లుతన నెత్తిన తానే నిప్పులు పోసుకున్నట్లుపాలు తాగుతూ తల్లి గుండెలపై తన్నినట్లుతినే అన్నంలో మన్ను కలుపుకున్నట్లుకడుపు నింపే అన్నదాతలపై లాఠీ దెబ్బలు ఏంటి?కార్లతో తొక్కించిచంపుడేంటి?ప్రాణాల్ని పణంగా పెట్టి ప్రజల ఆకలి తీర్చే అన్నదాతలపైఈ దాష్టీకం ఏమిటి?మంటికి ప్రాణం పోసిపైరును పసిపాపలా సాకిఅహర్నిశలు శ్రమించిప్రజల కడుపు నింపే కష్టజీవులపైఇంత కఠిన వైఖరి ఏమిటి?తిండి గింజలనేమన్నాఫ్యాక్టరీలనుండి ఉత్పత్తి చేసుకుంటారా?లేక కంప్యూటర్లలో డౌన్లోడ్ చేసుకుంటారా?దేశానికి వెన్నెముక రైతులే కదా మరి ఆ వెన్నెముకనే నూతన వ్యవసాయ చట్టాలపేరుతో విరిచేస్తుంటేదేశం కుప్పకూలుతుందిక్షామం రాజ్యమేలుతుంది.మేలుకో భారతీయుడా ఇకనైనాకనిపించని కుట్రలో బలవుతున్నవ్యవసాయరంగాన్ని కార్పొరేట్లకబంధహస్తాల నుండి రక్షించుకో - కె. నిర్మల కుమారి, ఖమ్మం టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి