Sun 28 Nov 04:47:32.40068 2021 మానవ జాతి మొత్తం జీవన యుద్ధంలో ఓడిపోయి అంపశయ్యపై ఆఖరి క్షణాల కోసం ఎదురు చూసే గాయపడ్డ దేహంలామౌనంగా కళ్ళు తెరిచిచూస్తోందిస్వార్ధపు సాలీడు అల్లిన దురాశల దారాల మధ్య చిక్కుబడిన సమాజం నేడు అచేతనంగా బూజుపట్టిన స్మశాన వాటికలా అగుపడుతోందిమానవ సంబంధాలన్నీ దారితప్పి పరిగెడుతూపిగిలిపోయిన దూదిపింజల్లా గాలిలోకి ఎగరాలని చూస్తున్న శిధిలమైన శరీరాలను తలపిస్తున్నాయిమంచితనం మమకారం మరిచిన మనస్తత్వాలు చివికిపోయిన శరీరాల మాంసపు ముద్దల అడుగున మిగిలిన ఎముకల గుట్టలను గుర్తు చేస్తున్నాయినైతికవిలువలు ధర్మాధర్మాలు విడిచిన మానవనైజాలుశవాల మెడలో వేలాడే వాడిపోయిన పూలదండల రాలిపోయిన గులాబీ రేకులను మరపిస్తున్నాయిఅసూయద్వేషాలు కుళ్లుకుతంత్రాల ఆలోచనల వాసనలతో నిండిన ప్రతి గుండెను తరచి చుస్తేతెరిచిన శవపేటికలా కుళ్ళు కంపు కొడుతోందిసమాజానికిప్పుడు కాస్తంత త్యాగాలతో నిండిన మానవత్వపు ఊపిరిలు ఊదాకపోతే స్మశానంలో ఎగురుతున్న అస్థిపంజరాల సమూహంలా మారుతుంది- ఎదర శ్రీనివాస్ రెడ్డి టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి