ఆలోచనల ముసురు అనవరతంగా కసిదీరా దాడిచేసి నీ జ్ఞాపకాల జడి తడిని ఆరనివ్వకపోతే..
నా జ్ఞాపకాల గుండె గడిలో నువ్వు లోపలుండి పోయి గడియ పెట్టుకున్నందున బైటి నుండి ప్రవేశాలన్ని నిషిద్ధమయ్యాయి
ఆలోచనసంద్రంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావం వల్ల హదయ తీరంలో తుఫాను వచ్చి కనురెప్పల వెంబడి ఏకధాటిగా చిరుజల్లులు కురుస్తున్నాయి..
దష్టి మరల్చడానికి విఫల ప్రయత్నాలెన్ని చేసినప్పటికీ నీ స్పష్ట రూపం నా అస్పష్ట ఆలోచనల్ని వమ్ము చేస్తూ నీ స్మతుల అతివష్టి సష్టిస్తున్న అల్లకల్లోలం వర్ణనాతీతమే..
స్వప్నాల సరిహద్దుల వెంబడి కాలం పహారా కాస్తుంది కనీసం స్వప్న లోకంలో ప్రశాంతంగా విహరించనివ్వడం లేదు నిజజీవితంలో నింపాదిగా నను బ్రతకనివ్వడం లేదు.. - సర్ఫరాజ్ అన్వర్, 9440981198