Sat 11 Dec 23:29:43.688968 2021 దోసిట్లోంచి ఇసుకలా జారిపోయే బాల్యపు రేణువులను/అణువణువునా హత్తుకొని అరచేతిలో పట్టేసి/ప్రియంగా చేసిన పిట్ట గూటిలో పదిలంగా పొదువుకున్నా/ తీరిక లేని జీ(వి)తపు ఆటలో నుంచి/ తీర్పాటం చేసుకొని తరచూ తనివితీరా తడుముతుంటా/ బాల్యపు ఆనవాళ్లు ఇంకా బతికేవున్నాయనిపిస్తుంది/గోటీలాటలో గిల్లికజ్జాలుపాలబువ్వ గోరు ముద్దలు/అచ్ఛాల ముచ్ఛాలుతెల్ల గాగితంలా మనసు/మల్లెపువ్వుల నవ్వులుఇంకా ఎన్నో మరెన్నో.../ఇప్పటికీ బాల్యపు భావాలు భద్రంగా వున్నాయి/ నేటి మనిషితనంలోని తీరికలు/ ఎప్పుడో తీరాలు దాటిపోయాయి/ ఏ అమావాస్యకో పున్నానికో.../ అంతర్జాలంలో ఆర్జీ పెట్టుకుంటే కానీ కానరారు/గుండెగూటిలోని గుప్పెడు పసి ఊసుల్ని/పిట్ట గూటిలో పొందుపరిచాను/తట్టెడు తీపి మాటల పన్నీరు జల్లుకుందాం/వీలుచేసుకొని వాలుతారు కదూ...?/ - బొప్పెన వెంకటేష్, 9866584062 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి