Sat 08 Jan 23:24:36.973227 2022
Authorization
మిన్ను విరిగి మీద పడ్డట్టు
కంటికి కనిపించని ఒమీక్రాన్ మహమ్మారి
మళ్ళి బుసలు కొడుతూ
మత్యువై తరుముతుంటే
జీవులు ప్రాణాలరచేత పట్టుకొని పరుగులు తీస్తుంటే
దారి కాచి దానవత్వం చూపనేల
ఎండకు నీడ తోడుగున్నట్టు
వానకు గొడుగు తోడుగున్నట్టు
మనుషులమై మానవత్వం బతికే వుందని చాటుదాం
లాక్ డౌన్ లో స్వీయ నియంత్రణ పాటిద్దాం
జనావళి బతుకు పై బరోసానిస్తూ నమ్మకం కలిగిద్దాం
ఆశలు మోడై న ఇలా తలానికి దాహం తీర్చే ఓయాసిసులమవుదాం
అక్కడో పసికందు
పందుల దాడి కి ప్రాణాలు వదిలింది
ఇక్కడో నిండు గర్భిణీ నడిరోడ్డుమీద ప్రసవించింది
ఇంకోవైపు వలసకూలీల ఉపాధి కి ఉరి
నరకయాతన జీవితంలో వారి ఆశలు ఆవిరి
విషవలయంలో మత్యు ప్రళయం లో
కంచెలు వేసి, సరిహద్దులు గీసుకున్న దేశాలు
శిశీరంలో రాలిపోయిన ఆకులమల్లె
కరోనా కాటుకు విలవిలలాడుతున్న జనాలు
కరోనా గ్రహణమై పట్టుకొన్నది
సునామీ లా సుట్టుకున్నది
కాలంతో జతకట్టి ఉప్పెనై విరచుకపడి మానవాళికి
మరణశాసనం లిఖిస్తోంది
మత్యువు ఇప్పుడు
అన్ని వసతులు వున్న గడప మాటున పొంచివున్నది
మురికివాడల గుడిసెల మాటున పొంచివున్నది
అవనికి ఆస్కాఆసాంతం నిశి చికటి కమ్ముకుంటుంది
గాజుకళ్ళ చూపు సన్నగిల్లి కంటి పొరల నిండా గాయాలు
మాయా జలతారు మెలిపెడుతుంటే చచ్చిన ఆశలకు జవనిద్దాం
బోసినవ్వుల చిన్నారుల భవిష్యత్తు కై బతుకు నిద్దాం
మనిషికీ మనిషి కి దూరం గుంటూ
పచ్చి క పలుకుల్లో తడి చినుకుల ప్రేమ కురిసినట్టు
బరోసానిద్దాం, కాసింత నమ్మకమిద్దాం.!
- భూతం ముత్యాలు