తాటాకుతో కప్పిన పూరి గుడిసెలో నేలజారిన మట్టి కుండవైపే చూస్తుంది మాయమ్మ.
పదిలంగా దాచుకున్న ఆరు అణాలతో అత్తారింట్లో అడుగిడిన తొలినాళ్లలో కొన్న మట్టి కుండ అది.
మట్టి పాత్రలో తోడుకున్న పెరుగు . అమ్మ మనస్సులా స్వచ్చంగా ఉంటుందని చెప్పిన తన బామ్మ మాట యాది చేసుకుంటూ...
డెబై సంవత్సరాల అనుబంధానికి నేటితో ఋణం తీరిపోయింది. కనుచూపు మసక బారిందేమో. అడుగు తడబడిందేమో!సత్తువలేని చేతుల్లో ఒదగలేక నేల జారిందేమో మట్టి కుండ.
రెక్కలు వచ్చిన పక్షుల్లా, తలోదిక్కు వెళ్ళిన బిడ్డల్లా నేలపైన నలుదిశల్లో మట్టి కుండ శకలాలు.. బామ్మ తదేకంగా చూస్తుంది వాటి వంక ఋణాను బంధం రూపేణా!అంటే ఇదేనేమో
సష్టికి మూలం అవని. తనలో పురుడు పోసుకున్న ప్రతి జీవి తిరిగి తన లోనే కలసిపోతుంటే.. సష్టి నియమాన్ని కాదనగలవరెవ్వరు అనుకుంది బామ్మ... నేడు మట్టి కుండ,రేపటి రోజు తనుకూడా. చేరవలసినది ఆ మట్టిలోనే కదా అనుకుంటూ. - రాము కోలా, 9849001201