Sat 05 Mar 23:31:36.473624 2022 విరిబాల వంటి సుకుమారంమనసు నిండా మమకారంనిండైన ఆత్మ స్థైర్యం...ఆశయ సాధనలో మొక్కవోని ధైర్యం..సహనం హద్దులు దాటితే మాత్రం.. దాల్చుతుంది ఉగ్రరూపం.అయినా అనాదిగా వంటింటి కేపరిమితం!కానీ..కాస్సేపు నీ ఇగోని పక్కకు పెట్టిమనో నేత్రంతో చూడు..సరికొత్త రూపం సాక్షాత్కరిస్తుంది..నిగూఢమై వుంటుంది పరాక్రమం..కరవాలం చేతపడితే శత్రువులు హతం.అధికారంతో సంఘంలోని కలుపును తీస్తుంది.!అసాంఘిక శక్తులను అడ్డుకుంటుంది.!వెన్ను చూపని తెగువతోరాజ్యాలేలినా...సష్టి రహస్యాలు కనుగొన్నశాస్త్ర రంగంలో నైనా..సాటిలేరు..మగువ తెగువకు!ప్రజ్ఞ పాటవాలకు నిలువెత్తు నిదర్శనం...ఇష్టమైన కళల్లో పొందుతుంది నైపుణ్యం!సకల శాస్త్రాల్లో ఆరితేరినాకుటుంబానికి ఇస్తుంది ప్రాధాన్యం!చీకట్లో మెరిసే నక్షత్రాల వ్యక్తిత్వం... మహిళ మానసంప్రేమ దేవతలా ఆదరిస్తుంది.ఆదిపరాశక్తి లా దుష్ట సంహారంచేస్తుంది!అంతటా తానే.... అన్నింటా తానే!!మహిళ లేని మహి.. శూన్యం!! - ఎం.పి.ఊర్మిళా జ్యోతి, 9848675917 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి