Sun 20 Mar 04:42:39.287576 2022 తన పేరే స్వరాజ్యంతలవగానే చైతన్యంతరలిపోయె తల్లితానుపోరాడి జీవితాంతం పద్నాలుగు ఏళ్ల వయసు బందూకు పట్టి తాను పీడన ఎదిరించింది దొరల పీచమణచిందిభూస్వాముల బిడ్డయినాబానిసలకు నాయికగాబరిలోకే దూకిందిఅరుణతార వెలిగింది సాహసాల చిరునామా త్యాగనిరతి చిహ్నమామె ఆశయమే అనవరతం మహిళోద్యమ పతాకం ఆడంబరమా తెలియదుఅట్టహాసమే ఎరుగదుకపటం స్వార్థం తలవనిశ్రమజీవుల సమరదీప్తి తెలంగాణ వీరమాత తెలుగుజాతి స్పూర్తిదాత చిరకాలం మనతోనే పయనిద్దాం తన బాటే (అమ్మలాటి స్వరాజ్యానికి ఆశ్రుతర్పణతో)- తెలకపల్లి రవి టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి