నాకన్నా పొడవయిన నా నీడ నేలమీద వాలి కూలిన ఆశల గురించీ కాటగల్సిన కలల గురించీ తలపోస్తున్నది ఎండిపోయిన నేలంతా ఎడారి వాసన ........... దుఃఖంలో తడిసి ముద్దయిన కళ్ళు కలలుగనడం నేర్చుకుంటున్నాయి ...... నేరానికి గవాః లేదు సుబూత్ లేదు శిక్ష మాత్రం ఖరారు మనసు ఆకాశం నిండా బులెట్ గాయాలు ......... నేరం నడిచి వచ్చిన బాటదా ద్రోహం వెంట నడిచిన మనుషులదా చేతులకు కత్తులు మొలిచాయి