అమాయకపు శుభ్రమైన మొఖంతో ఆకాశాన్ని చూస్తున్నప్పుడు బంగారు వర్ణపు మేఘాల్లో నేను దాచుకున్న కొన్ని పూర్వపు అపూర్వ బాల్య జ్ఞాపకాలో బతికిస్తున్నాయి నన్ను...
అయినా ఎప్పుడూ నాకూ వాళ్ళకూ మధ్య లీలగా ఒక యుద్ధం సాగుతున్నట్టుగానే ఉంది జడత్వాన్ని చేధించాలని ఆవిష్కరణలు గావించాలని ఏ పరిశోధనల కుప్ప మీదనో నేను నిద్రిస్తుంటాను మెలుకువలో ప్రతి మాట బాణమై గుచ్చుతుంది వాళ్ళను వాళ్ళవేమో ముళ్ళ కంపలై వెగటు పుట్టిస్తాయి నాకు
ఇది సహనానికి తణీకరణకు మధ్య వాగ్వివాదం ఇది సాధారణీకరణకు అస్తిత్వానికి పెనుగులాట రక్తం మెదడు పొరల్లో చిందుతుంది కత్తులు పెదాల అంచుల్లోంచి విసరబడతాయి గుండెల్లో మాటి మాటికి ఖాళీలేర్పడతాయి ఎవరు ఎన్ని చెప్పినా వద్దనే ఒక చేయి చూపినా శాస్త్రవేత్తకు ఆ బిందువు మాత్రమే కనిపిస్తుంది కదా!