Sun 05 Jun 00:26:17.858303 2022 బకాయిలు తీర్చలేక...బ్రతుకు మోయలేక...పండుటాకులా పుడమికొరుగుతూ...విగతజీవులుగ మారుతున్న రైతన్నలను...నీ కన్నులారా కనవమ్మా...అందరి ఆకలి తీర్చే రైతన్న..పట్టెడన్నం కోసం పొట్ట చేతపట్టుకొని...పట్టణాలకి పరుగులెడుతుంటే...పట్టించుకోవు ఏవమ్మా...?అవని మీద అభిమానంతో అవస్థలెన్నో పడుతూ...ఆశగ పెట్టిన పైరు ఆకరికి అందక...తెచ్చిన అప్పులు తీరే మార్గం కనపడక...అవని పుత్రుడు ఆ అవనినే ఆశ్రయిస్తుంటె అడ్డుపడవు ఎందుకమ్మా...?పచ్చని పంటపొలాలు బీడుగమారి...నీరులేక నేల నింగికేసి చూస్తుంటే....నిబ్బరంగ నీవు ఎలా ఉన్నావమ్మా...?వరుణదేవుడు వరమివ్వడు..ఓటు వేయించుకోని గెలిచినవారు ఓసారన్న తిరిగి చూడరు....పైరుకి పెట్టిన ఖర్చులు కూడ చేతికి రాక...కష్టాలన్ని చుట్టాలుగ చుట్టుచేరగ...నిండ ఇబ్బందుల్లో నిలువున తడుస్తూ...బయటకొచ్చే మార్గం తోచక...నిండు ప్రాణాలను ఉరితాడుకో.. పురుగుల మందుకో అంకితమిస్తున్న నీ బిడ్డలను కన్నులార చూడవమ్మా... - ఇంద్రజ గడిపర్తి టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి