ఆంక్షల వలయంలో నేను చిక్కుకున్నాను! మర యంత్రంగా మారి తిరుగుతున్నాను! మాట్లాడే నా నోటికి తాళం వేశారు!
వినే నా చెవ్వుల్లో సీసం పోసారు! నడిచే నా కాళ్లకు సంకెళ్ళున్నాయి! పనిచేసే నా చేతులకు బేడీలున్నాయి! చుట్టున్న లక్ష్మణ రేఖను చ్చేధించలేను! రెక్కలున్న నా దేహాంతో పైకెగరలేను! గొంగళి పురుగునై నేను గూడుకట్టుకున్నాను!
ఇదే నా జీవితమని సర్ది చెప్పుకుంటున్నాను! న్యాయ దేవత నా వైపు కన్నెత్తి చూడడం లేదు! కళ్ల గంతలు విప్పుకొని పలకరించడం లేదు! వీలు కలిపిస్తే చాలు నన్ను నేనూ నిరూపించుకుంటాను ! ఆడ పులిగా మారి విజంభిస్తాను!