Sun 19 Jun 05:58:58.539685 2022 పొరలు పొరలుగా అల్లుకున్న లోగిలిపైపైన కఠినత్వం..లోలోన అమతత్వం..నాన్న ఎప్పుడూ పూర్తిగా ఆవిష్కతం కాని వజ్రాల గని...!చిన్ననాడు నీ ఆటపాటలనివీపున మోసిన గుర్రపు స్వారి నువు మారాం చేసినపుడుగుండెలపై ఆడించి తినిపించిన గోరుముద్ద..!నీకు బతుకు ఓనమాలు నేర్పడానికిబెత్తం పట్టుకునే క్రమశిక్షణనువు పచ్చ పచ్చగా చిగురించడానికిలోలోపలి సారవంతమైన మత్తిక..! చెమట చుక్కల కష్టార్జితాన్ని నీ కోసంఇష్టంగా ఇచ్చివేసే త్యాగాల బావుటా నువ్వు నవ్వుతూ నిలబడడానికికన్నీళ్లను దాచిన గరళకంఠుడు..!ముసిరిన చీకటి ఓటమిలో నీకు వెలుగునిచ్చే కాంతిపుంజంకురిసిన నీ చిక్కుముళ్ల జడివానకిగొడుగై నిలిచే భరోసా..!జీవన సమరంలో నిత్యం ఓడుతూ నిన్ను గెలిపించిన మేరునగధీరుడు నాన్న...!తరతరాల వారసత్వాన్ని నీకు ఇచ్చికుటుంబాన్ని నిలబెట్టే ఎనుగర్ర నాన్న..!!- డా. వాసాల వరప్రసాద్, 9490189847 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి