ప్రైవేటు జాబుకైనా చేబదులే తప్పనిదై వడ్డి విరగ బడితే ఆ అప్పు తీరదు ఆ అప్పు తీరదు ||జీత మింత||
పర్సులోన క్రెడిట్ కార్డు పరువు కాదురా పల్చనైన దాని కన్న బరువు లేదురా ||పర్సులోన||
పేరు మార్చి పిలిచినా... అది ఉద్దెరే అవుతాదీ వడ్డి కోత కోసినా... అది అసలు కే ఎసరు ఏత్తాదీ బ్యాంకులోన తీస్తే అదే ఈయెమ్మై రా... చిట్టీ లెత్తి కట్టుకుంటె కిస్తీ లంటరా... ||జీత మింత||
అందరూ చూసొచ్చిన తోవ ఒక్కటే... అప్పు పత్రాలు పలికే మాట ఒక్కటే... ||అందరూ||