ఒక మౌనం నుంచీ మరొక గేయం చిగురిస్తోంది ఒక ఉత్కంఠ నుంచీ కొత్త ఉషోదయం ఊవిళ్లూరుతోంది
ఒక్క చినుకు వేల ఉషస్సులై కలల దారులెంట నడిపిస్తోంది ఆశలు అలలై లేస్తూ కళ్ళు పంటల ప్రమిదలౌతున్నారు
దుక్కితో నవ్విన నేల దిగులునంతా దిష్టి తీసుకొని ఆశగా పంటల కలల్ని నెమరేస్తోంది
వానొక్కటుంటే చాలు రోజులన్నీ రైతు రాజువే పంటలు నిలిచి నడిస్తే చాలు దేశం గుండెల నిండా సిరి,సంపదలే ఇప్పుడు చినుకు పూల స్పర్శ రైతు గుండెకు నేస్తమై నిలుస్తోంది...!!