ఎండిన చెట్టుకు ఒక్క ఆకుపచ్చ ఆకైనా లేకుంటేనేం అన్ని రంగుల పార్టీ జెండాలతో అగ్ర తాంబూలంగా రాజకీయాలకు వేదికైంది జెండాల అంగడి ఎండిన చెట్టు ! పక్షి గూళ్లకు జాగే లేదు !
ఎండిపోయిన చెట్టు ఒకటే ! వందల జెండాలకు ప్రకాండం అండ దండ ఎజెండా ! మోడైనా పార్టీల జెండాలతో రెప రెప !
జాతీయ రహదారి పక్కన ఉండే ఈ ఎండిన చెట్టు జాతీయ ఎన్నికలకే అంకితమై పోయింది !
ఈ చెట్టు పేరు మద్ది చెట్టు కాదు రావి చెట్టు కాదు వేప చెట్టు కాదు జెండాల చెట్టు !
ఎండిన చెట్టు అభాగ్యంగా నా దేశానికి ప్రతీక ఈ చెట్టును చూసి దేశంలో ఎన్ని పార్టీలున్నాయో సర్వే చేయకుండానే చెప్పవచ్చు చెట్టుకు ఏ ఋతువు లేదు జెండాలు జెండాలుగా ఎన్నికల ఋతువు
జెండాల చెట్టుకు సెల్యూట్ కొడితే అన్ని పార్టీలకు జేజేలు కొట్టినట్టే
ఎన్నో వానలకు చెట్టు చిగురిస్తే పార్టీల జెండాలు కనపడకుండా పోతాయి ఎండుటాకుల్లా రాలిపోతాయి ! అప్పుడు ఈ చెట్టు సస్యశ్యామల నా దేశానికి మినార్ ఔతుంది. - కందాళై రాఘవాచార్య 8790593638