Sun 24 Jul 00:14:17.131465 2022 ఇటుకలపై ఇటుకలు తయారుసేత్తిమి...మాపై ఇసుమంత ఇట్టంలేకపోయె !ఆకాసమెత్తు సౌదాలపై సౌధాలుకడితిమి ...మాకు కూసంత సోటుఇయ్యకపోతిరి !రాదార్లపై రాదార్లు ఏత్తిమి ...మాపై రవ్వంత పేమసూపకపోతిరి !ఆనకట్టలపై ఆనకట్టలునిర్మిత్తిమి ...మమ్మల్ని ఆపదలో ఆదుకోపోతిరి !బరువులపై బరువులు ఎత్తితిమి ...మా బతుకులకు బరోసాఇయ్యకపోతిరి !రాళ్ళను రతనాలుగా సేసితిమి ...మమ్మల్ని రాళ్ళ కంటే హీనంగాసూత్తిరి !మొక్కలను మనసెట్టి నాటితిమి ...మాపై మానవత్వం మరిసితిరి !కానీ... ఒక్క మాట సెప్తఇంటారా సారూ ...అబివుద్ది కోసం ఈ దేసమంతాఅడుగులేత్తాం ... అవసరమైతేఈ దేసం కోసం మా పానాలైనాఇత్తాం ... సారూ ... ఆ ..!!!- బోనగిరి. పాండు రంగ టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి