Fri 29 Jul 23:11:12.213587 2022 వేయి ఓటములు నాకివ్వుఅజేయమైన విజయమాల నీకందిస్తానుకొన్ని శిశిరాలు నాకివ్వుకోటి వసంతాలు నీ ముంగిట కుమ్మరిస్తాను !ఈ వాన వెలిసిపోయేదాకా ఓపికపట్టుఏడురంగుల ఉయ్యాలలో నిన్నూపుతానుఈ రేయి చీకటినదిని యీదుకురారేపటి వేకువచెట్టుకు పూసిన వెలుగుపూలనునీ మునివాకిట కుప్పవోస్తాను !కాస్త తెగువనీ,యింకాస్త ధైర్యాన్నీ నాకివ్వు అనంతమైన స్వేచ్ఛను నీకందిస్తానుఆ విప్పపూల చెట్లసిగన దాచినవిల్లమ్ములు నాకివ్వు రెల్లు పూలగుత్తిలాంటిశాంతిని నీకు చూపిస్తాను !!- సిరికి స్వామినాయుడు సెల్: 94940 10330 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి