Sun 31 Jul 23:45:25.748484 2022 ఉదయం పూచే తొలికిరణాలు అక్షర పుష్పాలై కవుల కలాల.. ఆనంద డోలికలో తేలియాడుతూ.. కవన అరుణోదయానికిబాటలు పరుస్తాయిప్రకతి పంచిన సౌందర్య గుబాళింపులతో పచ్చని మొలకల సామ్రాజ్యపు ఫలాలు వటవక్షల్లా కావ్య రసమతంబులయి మేలుకొలుపవుతాయివిరిసిన ముద్ద మందారంలా తొలి పొద్దు సూర్యుడు అక్షరాల ఒరవడిలో ఆలంబనయి కొంగ్రేత్త రచనలకు ఉతమిస్తాడుఅలసి సొలసిన నిరాశ నిస్పహలల్లో నిదురపోతున్న మనస్సు లోగిలిని జాగతం చేయ నవ్య భావ ఆవిష్కరణలకు మస్తిష్కంలో జీవనదిలా అక్షరకెరటాలు తొలకరిలో నెమలి నాట్యంలా పురివిప్పి ఆడుతాయిఆకాశానికి రెక్కలు తొడిగి హరితహారమైన పుడమి తల్లీ నుదుట ఎర్రని సింధూరంతో కవితల మల్లియల రత్నాలు సిగలో తురుముకొని శరత్కాలపు వెన్నెలలో విహరిస్తుందిఏ మహాకావ్యలైన -ఏ కవిత కుసుమలైన సమాజ పరిపుష్టికి బుద్ధుని జ్ఞానోదయ బోధివక్షాలే! నాటి నేటి రేపటి కాలాల చరిత పుటలాల్లో మనిషి జీవన పరిణామక్రమానికీ చైతన్య దీపికలవుతాయి.!!- రవీందర్ కొండ టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి