Sun 31 Jul 23:45:32.246994 2022 నది ఉప్పొంగి ఎగిసివచ్చిఆత్మతో ఆప్యాయంగానా పాదాల్ని ముంచెత్తిన రోజుననన్ను నేను తెల్సుకున్నానుఅద్దం అబద్దం చెప్పదునీళ్ళు నిలకడగా వుండవునా నీలం రంగు కళ్ళుపచ్చదనాన్ని కలగంటున్నాయిచెవులేమో నీటి అలలసంగీతాన్ని వింటున్నాయినడిచినంత మేరాఇసుకలో నా పాదముద్రలుగడ్డకట్టిన అనుభవాలుగడిచినకాలపు ఆనవాళ్ళుజ్ఞాపకాల్ని వెంటేసుకునినది నెమ్మదిగా కదిలిపోతున్నదినేనిట్లా నిలబడి పోయానుమరో నదిని కలగంటూ.. - వారాల ఆనంద్, 9440501281 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి