Sat 06 Aug 06:22:45.19365 2022 వాడు బరిలో లేడుఅయినా...వాడితోనే ఆట మొదలైందిఎవడు కూత పెడుతున్నాడోఎవడు పట్టు బడుతున్నాడోఅంతా గందరగోళమేపొంచి పొంచిపంజా విసురుతూపరుగుకాళ్ళకు సంకెళ్ళేస్తూ...గీత కివతలి వైపే మూసేస్తున్నారుకూత కంఠాన్ని ఆపేస్తున్నారుపంపేవాడొకడు... వచ్చేవాడొకడువొక్క పాయింటన్నా తెస్తాడనీ'కోటి' ఆశల సూటు 'కేసు' లెన్నోఒకరి ఆట ఇంకెవ్వరో ఆడేస్తున్నారుమరెవడో అవుటై పోతున్నాడుబలాల బలగాల కలగాపులగాలకుఎంపైర్లూ దోషులవుతున్నారుప్రత్యక్ష దృశ్యాలన్నీపరదా చాటుకు వెళుతున్నాయిఆట ముగియకముందేగెలుపు మీసం మెలేస్తున్నాడొకడుఇప్పుడు ఆటంటే...!ఆనందాల వినోదం కాదుగెలుపు దృశ్యమంటేఆట ముగింపు అంతకన్నా కాదుశకుని పాచికలాటరాజ్యాలను కూల్చే కుతంత్రపు పాటప్రతీ రంగంలోనూశత్రువుంటాడు... మిత్రుడూ ఉంటాడుపరోక్షంగా ఓ యుద్ధం దాగుంటుందిఓ విజయమూ దాగుంటుందిఅయితే... ఇప్పుడు యుద్ధమంటే...!శత్రువుతో పోరాటం కాదుమిత్రుడి వెన్నుపోటును గుర్తించటమే-డా.కటుకోఝ్వల రమేష్ సెల్:9949083327 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి