Sat 01 Oct 23:26:25.498147 2022
Authorization
చిత్రహింసలు, మూగవేదన, మానవహక్కులను హరించిన
నిలువెత్తు కట్టడం సెల్యులార్ జైల్
చుట్టూ 1000 కిలోమీటర్ల భయంకరమైన సముద్రం,
నిత్యం యోధుల కనుల లోపల కానరాని
సునామీల సుడిగుండాలు,
కరుడు గట్టిన హృదయాలను సైతం కరిగించును
జైలు గోడల గోడుకు సాక్షి భూతముగా నిలిచిన మర్రిచెట్టు,
స్వేచ్ఛ కోసం పోరాడి, స్వేచ్ఛను కోల్పోయిన,
జీవ చైతన్య రహిత చలన రాశులు,
ఎవరి జీవ సమాధులు వారే నిర్మించుకున్నారు.
చాలా చిన్న గదులు, అనుమతి లేనిదే,
గాలి కూడ చొరబడదు.
ఒక్కో గదిలో ఒక్కో యోధుడు,
సంవత్సరాలుగా ఒంటరి తనముతో,
ఎవరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వారికి
భయంకరముగా వినిపిస్తాయి.
ఆ క్షణములో యోధులు పడ్డ మూగ వేదనే కదా,
నేటి ఆజాది అమృత తుల్యాలు....
నిత్యము ఆజాది కోసం ఆరాటం, పోరాటం,
బ్రిటిష్ జైలర్ దుష్ట శాసనుడు,
యోధుల పాలిట యమదూత.
నిత్యము కాళ్లకు, చేతులకు సంకెళ్లు,
కదలాడని స్థితిలో గంటల కొద్ది గోడలకు వేలాడదీసిన
అస్థిపంజరాలవుతారు.
దప్పిక వేస్తే వారి కన్నీలే వారి దాహాన్ని తీర్చేవి.
ఆ క్షణములో యోధులు పడ్డ చిత్రహింసలే కదా,
నేటి అజాది అమృత తుల్యాలు...
లికఠిన శిక్షలతో కంటికి నిద్ర కరువు,
రోజంతా శ్రమతో కండలు కరిగించి,
రక్తం శుద్ధి చేసి నూనెగా ఒలికిస్తారు.
కొబ్బరికాయలను బద్దలు చేసి, పీచులతో
ఎవరి ఉరితాళ్లను వారే పేనుకునే దుస్థితి.
సామర్ధ్యం కంటే ఎక్కువ పని ఇచ్చి,
తక్కువ పనిచేస్తే ఎక్కువ శిక్షలు అమలు,
నీరు, ఆహారం బందు చేసి,
గోడలకు శిలువవేసిన క్రీస్తునిగా మార్చి
కొరడాల జాతర.
తాళ లేక తప్పించుకోవాలని చూస్తే,
తప్పని మరణ మృదంగం.
ఆ క్షణములో యోధులు పడ్డ కష్టాల కన్నీళ్ళే కదా,
నేటి ఆజాది అమృత తుల్యాలు.
లిఅండమాను ఆకర్షణీయమైన ప్రదేశం మాత్రమే కాదు,
దేశభక్తులు నడయాడిన నేల,
స్వేచ్చ స్వాతంత్య్రమునకు ఊపిరులూదిన నేల,
మొట్టమొదట స్వాతంత్య్రం సిద్ధించిన నేల,
ఆ నేలలో ఇవ్వాలి ప్రజాసేవకులకు ఇవ్వాలి శిక్షణ,
సెల్లులార్ జైల్ కావాలి మరో ప్రపంచపు సందేశం..
- వైద్యం భాస్కర్, 6305871912