Sat 01 Oct 23:39:23.622591 2022 గౌరమ్మ... గౌరమ్మ ...నువ్వే మా బతుకమ్మమా తల్లి బతుకమ్మ మమ్మేలే బొడ్డమ్మచీరా సారేలు తెస్తాం చల్లంగా సూడమ్మామాయమ్మ మాయమ్మ కరుణించవే మాయమ్మ!ఆడపిల్లల బ్రతులకు అడుగడుగునా గండాలయేనడిరోడ్డు పైనే నల్లిలా నలిపేస్తున్నారేఎంటా చూస్తున్నావు ఈ ఘోరాలమ్మ !మాయమ్మ మాయమ్మ కరుణించవే మాయమ్మ!నీ అంశతో పుట్టిన ఆడబిడ్డలకు అండగా ఉండాలమ్మాగునుగుపూలనే తెస్తాం మాలో గుబులు తీసేయమ్మముద్దా చామంతులిస్తాం ముత్తైదు బాగ్యాలు ఇవ్వమ్మామాయమ్మ మాయమ్మ కరుణించవే మాయమ్మ!పసిపిల్ల, ముసలమ్మ అంటూ వరుసలే మరిచిండమ్మతంగేడు పువ్వులనిస్తాం తరిమికొట్టు దుష్టులను మాయమ్మమా ఇంటి దీపాలకు వేంటుండే సద్దులమ్మమాయమ్మ మాయమ్మ కరుణించవే మాయమ్మ!అన్యాయపు కోరలను చీల్చి చెండాడవే పెద్దమ్మ !పిల్లాపాపలతో నిన్ను కొలుసుకుంటామే గౌరమ్మబతుకమ్మ బతుకమ్మ కాపాడవే మాయమ్మ !గౌరమ్మ... గౌరమ్మ ...నువ్వే మా బతుకమ్మ!- జ్యోతి మువ్వల, 9008083344 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి