బీడువారి పోతుంది నామది.. భావాలను పండించలేనంటూ... మనస్సులో గ్రీష్మతాపంతో నువ్వు రగిలిపోతుంటే ఎలా మనగలను నీలో అంటూనే...
అవును నిజమే జీవితమే మోడువారుతుంటే ఇక భావాలకు నెలవెక్కడా..... . కడదాకా నీతోనే అన్న మాటలను.. పేకమేడల్లా కూల్చేస్త్తుంటే... జ్ఞాపకాల సమీకరణలో నయనం అశృనిలయమౌతుంటే.....
వేడుకోలే వేదనకు శ్రీకారమౌతుంటే... జ్ఞానతీరం దాటి అజ్ఞాన తిమిరం చేరుతుంటే ఇక మనసులో వసంతరాగం ఎలా పలికించగలను. అక్షరాలను ఎలా తోడు నిలుపుకోగలను.. వేదన వైరాగ్యమై.. ఎదను కాల్చివేస్తుంటే.. ఇక తనవు గ్రీష్మతాపంతో రగిలిపోదా...
అక్షరమా మన్నించుమా.. భావాలను బతికించలేను... మోడు వారిన మనస్సుపై మరోసారి అక్షరాభ్యాసం నేర్పగల నేస్తం వచ్చేంతవరకు....