నా పేరు మీద గుంట జాగ లేదే .. నేను సద్దామన్న రైతుబీమా రాదే.. అయినా తరాల తరబడి సాగు చేసే కౌలు రైతు నేనే...!
చెమట చుక్క చిందించనోడికి.. 100 ఎకరాల పట్టా ఉన్నది.. పలుగు, పార తెలియనోడికి.. రైతుబంధు అందుతున్నది.. రియల్ ఎస్టేట్ వ్యాపారులకే ప్రభుత్వం మొత్తం దోచి పెడుతున్నది.. పుడమికి పురుడు పోసిన నన్ను ' కౌలు' పేరుతో చంపుతున్నది..!
బ్యాంకోడు రుణం ఇవ్వడు వడ్డీ వ్యాపారి దగ్గరికి రానివ్వడు కౌలు ఇవ్వనిదే భూ స్వామి భూమి ఇవ్వడు సర్కార్ రైతుగా గుర్తించదు
దున్నకం రేట్లు రెట్టింపుపాయే ఎరువులు, విత్తనాల కొరతయే పంటకు గిట్టుబాటు లేకపాయే 'కౌలు' కూడా యేల్లకాపామే అయినా నేను చేస్తా వ్యవసాయం పేదోడి ఆకలి తీరేదాకా.. కాటిలో నేను కాలే దాకా..! - ఎ.అజయ్‌కుమార్, 8297630110