గీత లోపలుండైనా బతకాలె... గీత దాటైనా రావాలె. చిన్న గీత కింద పెద్ద గీత గీయడం కాదు. ఇంకా ఏవన్నా అంటే... అందరం ఒక్కచోట గుమికూడకుండా ఉన్న గీతల్ని చెరిపేసిన వాళ్ళే గొప్పోళ్ళు. అప్పుడే కదా!.... అరసం- అభ్యుదయం నయాగారై కురుస్తుంది. కుందుర్తి గారిదే కదా( గారదే కదా). ఒకరు నవ్వారని మనం వెక్కిరించడం కాదు... అందరికీ మనవే ఆనందం కాలేమా.. తెల్సుకోవాలె. నేల నొదలకుండా ఆకాశానికెగరాలె. నీలో ఉంటూనే ఇంకొకల్ల ప్రేమించాలె. మన మార్గంలోనే నడుస్తూ... కొత్తదారులు వెయ్యాలె.. కుందుర్తి అందుకే కదా!... సాంప్రదాయాలను గౌరవిస్తూ... సంఘ సంస్కరణా వచనగేయ వీచికయింది.
- అనుముల ప్రభాకరాచారి. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత.