Sun 01 Jan 02:10:32.513182 2023 మనుషులు లోతుగా నడిచిమాట ఒత్తిడికి అర్థం చిత్తడయ్యకమనసులు దూరం గడచిచిక్కునడకతో కాలం చుట్టేసాకభుజాభుజాలు రాసుకునిగొంతులు అరిగెలా తిరిగాకవేల దృశ్యాలు వృష్టికికళ్ళు వరదయ్యాకమనసు మూతపడిమాట తప్పుకున్నాకగుండె శబ్దలే ప్రశ్నలుగాజావాబులు గుచ్చుకున్నాకనీడలూ చీకటిలో ఎదురైనిప్పులా ఎగిసిపడ్డాకనిజం నిలువుటద్దమైనిన్నటి రోజును నిలదీసాకఅడుగుతీసి అడుగేస్తేముక్కులు పగిలే వాసనతోనగంగా తప్పులుముఖాలపైగా నడిచాకఈర్ష్య గాలులకుపచ్చని చూపులు నల్లగయ్యాకఅసూయావేశం కురిసిపాదాలు వంకర్లు తిరిగాకమౌనం ముద్దలుముద్దలుగాబతుకులో గడ్డకట్టాకఅర్థం అగమ్యమైజీవితపు అంచులను చేరాకముక్కలైన మనసులోఅతుక్కోని ఒక్కచోటమొలిచిన ఓ గాఢ కోరికజీవితంలో మనిషిని చూడాలని ..కోటానుకోట్ల అడుగులోఒక్క అడుగు నా కోరికను విన్నామనిషి అబద్దం కాదు..నా ప్రశ్న వృధా కాదుబహుశా ఏ మనిషికి తీరని కోరికైతేనేను పేరాశగా నాది దురాశమనిషిని చూపలేని లోకానికినిత్యం ఓ పోరాటమే మనిషే....- చందలూరి నారాయణరావు 9704437247 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి