Sun 22 Jan 00:47:31.269178 2023 ఆర ముగ్గినపలుకు తొనల పండుఅమ్మభాషకొత్త కొమ్మల చురుకు నోళ్లకుమునుపటిలా రుచించడం లేదు!అమృత ధారల కోసంతేపకార్చే రుచిమొగ్గల్లావిచ్చుకున్న చివురు నాలుకలుఅనుకరణ మడతల్లోకిముడుచుకున్నాయిస్తన్యం పంచిన జీవామృతంతోఊపిరి మొలకనుఊహల కందని వృక్షంగా పెంచుకున్నాకతల్లివేరు తల తెగిపోతోందికొండ కనుమ లాంటి గొంతులోంచిఉబికొచ్చిన జీవధార ఎండిపోతోందిప్రాణాక్షరమై తడి నాలుక మీదతారాడిన తేమ ఆరిపోతోందిఅక్షరాల తొలకరి జల్లులాప్రేమ కురిసే నల్లబల్ల ఆకాశం కిందపూలతోట లాంటి బాల్యావరణమంతాఆమ్లవర్షం లాంటి ఆంగ్లవర్షంలోతడిసి ముద్దవుతోందిమెలికలు తిరుగుతూపిట్టగూడు వైపు పాకిన పాములాచల్లగా చొరబడిందిపరాయి పెత్తన భాష ..గుడ్లున్న తన గూడు చుట్టూటపటప రెక్కలాడుతూ ఎగిరేఓటి రెక్కల పిట్టలాసొంత భాష ..ఆనాటి తీపి బాల్యానికితీరైన ఆశ్రయమిచ్చిన భాషయిపుడు ఒక కాందిశీకురాలుఎన్ని యుద్ధాలను దాటైనాతనకొక పునరావాసం ఇవ్వాలిఇంట్లోనూ బడిలోనూ..- కంచరాన భుజంగరావు 9441589602 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి