ముచ్చట్లన్నింటిని మూటగట్టుకుని మధురమైన బచ్పన్ వెళ్ళిపోయింది నూనూగు మీసాల జవానీ తన నిషాని దిల్ లో అచ్చేసి అదే దారి పట్టింది...
చూస్తుండగానే అరచేతిలోని ఇసుకలా జీవితంలోని ఆ మధురక్షణాలు మెల్లిగా జారిపోయి మధురజ్ఞాపకాల ఫేరిజ్లో చేరిపోయాయి జీవన పయనంలో విలువైన ఆ మైలురాళ్లు దాటిపోయాయి..
జేబులో చిల్లిగవ్వ లేనప్పటికీ సంతోషాల అమీర్ గా నిలిపిన గిల్లి దండ ఆట వెళ్ళిపోయింది.. లక్ష్యసాధన, పట్టుదలకు మారుపేరైన గోటీలాటను దునియా లూటీ చేసింది..
వయస్సు మెల్లిగా కరిగి వృద్ధాప్య ఛాయల పూలు విరగకాసి కోతి కొమ్మచ్చి ఆట నాతో కచ్చి అయింది బాయిలల్ల కొట్టే కైంచిలను బడిలా లొల్లిచేసే వెనక బెంచీలను కాలం తనతో పాటే గోల్ మాల్ చేసింది
పస్తులున్నప్పటికి దోస్తులతో ఆడుకున్న ఆటలు, చినిగిపోయిన దుస్తుల్లో దోస్తులతో కలిసి చేసిన మస్తు మస్తీలు యాదోం కీ బరాత్ గా మిగిలిపోయాయి..
అప్పటిదాకా ఊసేలేని సంపద కల్మషంలేని దోస్తుల నడుమ విభజన రేఖ గీసింది గరీబ్ దోస్తిని బద్ నసీబ్ జేసి అంటరాని పాడెనెక్కించింది - సర్ఫరాజ్ అన్వర్, 9440981198