Sun 29 Jan 02:41:01.629371 2023 కాలి అందియలుఘల్లు ఘల్లుమంటుంటేచేతికున్న గాజులుగలగల అంటుంటాయి!నునుపెక్కిన బుగ్గలుఎరుపెక్కుతుంటేకందిపోయిన బుగ్గలుసిగ్గుపడుతుంటాయి!పెదవుల మీది నవ్వులుపువ్వులవుతుంటేనువ్వుల పువ్వులురువ్వుతుంటాయి!మాటల ఆణిముత్యాలుపాటలవుతుంటేప ద ని స లు సంగీతమైపాటల కచేరి చేస్తుంటాయి!తుమ్మెదలాంటి కురులుగాలికి ఎగురుతుంటేపసందుగా నుదుటినిముద్దాడుతాయి!కాటుక కళ్ళు తుంటరిగానవ్వుతుంటేకవ్వించే కళ్ళు కన్నుగీటుతుంటాయి!నుదుటి మీదున్నబొట్టు మెరుస్తుంటేనింగిలోని నక్షత్రాలునేల రాలుతాయి!వంపులు తిరిగిన నడుమువయ్యారంగా ఊగుతుంటేకల హంసలు నాట్యంచేస్తుంటాయి!పట్టు పరికిని తొడిగినఎంకి అందాలుజాలువారినా నండూరికుంచె అద్భుతాలు!మనుసు దోచేసప్త వర్ణ చిత్రాలుతలమానికమైన చిత్ర కళకేఅభివాదాలు!!- ఎస్.జవేరియా 9849931255 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి