Sun 29 Jan 02:54:29.556405 2023
Authorization
నా కనులకే తెలుసు
కలలు గన్న ప్రపంచం ఎట్లుందో!
పచ్చనిలొగిలి ప్రకృతి నుండి
రావణ కాష్ఠంలా రాలిపోతున్న సమాధివరకు
అటువైపుగా పాదాలు విడిచి
గుమ్మంలోకి ఆత్మస్తైర్యాన్ని నింపుకొని వస్తాయని.. !
మానవత్వపు తెరలను కట్టుకొని
సంపూర్ణ నమ్మకాన్ని వమ్ము చేయకుండా
మొక్కవొని నెలవువొలె
దృఢసంకల్ప బలంవొలె
వస్తుందో రాదోనని నిరాశతో
ఆశల సముద్రాన్ని తోడుతున్నా
దిగులు మేఘాలవైపు చూస్తున్నా
నిశ్శబ్దయుద్ధం తరుముకొస్తున్నా
నిండు మనసుతో
రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా.. !
ముంచుకొస్తున్న విపత్తులను గ్రహించి
కట్టడి చేసే శుభకార్యాలను
ప్రమాద మృత్యుకన్యను తుది ముట్టించేలా
కన్నీటి బిందువులను నేల రాల్చకుండా
కనబడని మబ్బులతో నల్లబడుతున్న జీవితాలను
హృదయమున్న మనుషులకు
భగవద్గీత సాక్షిగా
మేమున్నామని ధైర్యంగా భరోసా కల్గించేలా విశ్వాసాలను
అర్థాంతరంగా కరిగిపోతున్న ఆయువులకు
చరమగీతం పాడేలా
చాలీచాలని బతుకు దుప్పట్లకు రక్షణగా
నవసమాజ భవిష్యతు తరాలకు ప్రబలకుండా
ఒమిక్రాన్ రక్కసిపై పోరాటం చేయ్యాలని చూస్తున్నా.. !
ఏ మనసు పుస్తకం తెరచిన
భయపడుతూ వెనుకడుగు
వేస్తున్న అక్షరాలే !
అన్నదాతల మెతుకుల బతుకులకు
చెమట చుక్కల కర్షక కార్మికులకు
జీవితాన్ని నిలబెట్టే వైద్యులకు
రక్షణగా నిలబడే రక్షకులకు
పరిశుభ్రత చేసే కార్మికులకు
సకల జనుల మునులకు
మేమున్నామని మనోబలాన్ని
గుండెల్లో లిఖించాలి
ప్రస్తుతమంతా...
మౌన యుద్ధమే శరణ్యం
మనిషికి మనిషికి దూరమే భవితవ్యం
- డాక్టర్ పగిడిపల్లి సురేందరు
8074846063