Sun 02 Apr 01:14:43.69895 2023
Authorization
మనస్సు ఎక్కడో దారి తప్పిందేమో..
కలవరపడుతున్న అంతర్గతం
మాసిన గతాన్ని తవ్వుకుంటూ..
ఈనాటి క్షణాలను బూడిదలో
పోసిన పన్నీరు గావిస్తూ..
రేపటి తరాలకి అందించాల్సిన అక్షర జ్ఞానపు జ్యోతుల్ని
ప్రాశ్చత్య భాష మోజులో పడి
మాతృభాషని నిర్వీర్యం చేస్తూ..
తనను తానే మోసం చేసుకుంటూందీ...
అదృష్టమో.. దురదృష్టమో..
తెలియని సందిగ్ధవస్థలో కురుకుపోయి..
ఆంగ్ల భాష తెలుగు కవితాక్షరాలలో కలిసి
కొత్త రూపం సంతరించుకుంటూంటే
తెలుగు తేజాన్ని డాలర్ల వేలం పాటలో పాట పాడుతూ
అమ్మ భాషని అంతం చేసే
కుట్రలకి తెలియకుండానే
బలిచేస్తున్నారు..
బండలకి వున్న త్యాగగుణం
చెక్కె శిల్పి కున్న నేర్పుతనం
మైమరిచే తన్మాయాత్మములో
జీవంతో ఉట్టిపడుతూ
శిల్పమైన.. శిలలకున్న మమకారం
భాషభిమానులకి లేక..
పూర్వం రాజషం ఓలకపోసిన
అక్షరం..
ఒంటరై దిగులుగా పరాయితో
రాజీ పడలేక.. ఆత్మహత్య ఆలోచనతో కూచించుకుపోతూ
రాబోవు కాలాన్నికి అ, ఆ, ఇ, ఈ నుడికారాలని బతికించ
చీకటి అలుముకున్న మబ్బులలో
దాగిన అక్షర జల్లుల క్రాంతిని
కురిపించే తొలకరి మనుషుల
ప్రయత్నం ఫలించేలా..
సాహితి అంకురాలు
మన మెదళ్ళను తోలుస్తున్నాయి.!
ఆశతో కళ్ళలో కొత్త వెలుగులు
నింపుకొంటూ.. పరభాష వ్యామోహంను తరిమి..
తన మాతృత్వపు పరిమళాల
అక్షర సువాసనలు విరియ
కొత్త నెత్తురుని ముద్దడుతుందీ!!.
- కొండ రవీందర్, 9848408612