Wed 05 Apr 22:34:06.022816 2023 ఎందరున్నారీ విశాల విశ్వంలోఏసుక్రీస్తులు, సుందరయ్యలు! కాలాన్ని యశస్సుతో కొలిచేవాళ్ళు! త్యాగాన్ని మనస్సుతో పిలిచేవాళ్ళు.ఎందరున్నారీ భూమండలంలోకారల్ మార్క్స్‌లు, నెల్సన్ మండేలాలు! పీడితులకు ముక్తి మార్గం చూపిన వారు, విప్లవ జ్యోతి మండేలా ఆజ్యంపోసిన వారు.ఎందరున్నారీ భువన భవనంలోభగత్ సింగ్‌లు, సీతారామరాజులు! ఉరితాళ్ళను ముద్దాడినవారుపోరు సూర్యులై విప్లవం విరజిమ్మినవారు.ఎందరున్నారీ ధరణీతలంలోదొడ్డి కొమరయ్యలు, చాకలి ఐలమ్మలు!దోపిడీకి ఎదురొడ్డిన వారు.ఆధిపత్యాన్ని అణగదొక్కినవారు. ఎందరైతేనేమి? వారె మనకాదర్శంకొందరు, కొందరు కలిస్తే వందలు, వేలు కారా!ప్రశ్నించే వారేకద దేశ భక్తులు!పిరికిపందలెపుడూ గొర్రెల మందలే!స్వరాలు కరాలు కలిస్తేనే సమరాలు. వివరాలు తెలిసినా, విపక్షాల మౌనాలు పీడిత జనాన్ని ఏకం చేయకపోతే మాటలన్ని గారడీలె, కాలక్షేపం బటాణీలె!మన ప్రజాస్వామ్యం మరణశయ్యపై వుంది.బతికించే వైద్యులేమో అతి తెలివితో వున్నారు.శతులు, మతులు కుదరక, వైద్యం గతి తప్పుతోంది.ముహుర్తాలు చూస్తుంటే ముప్పు ముంచుకొస్తోంది.- కందాడై శ్రీనివాసులు టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి