మన దేశంలో అతి పురాతనమైన వాటిలో అజంతా, ఎల్లోరా గుహలు ఎంతో ముఖ్యమైనవి. వీటి తవ్వకం క్రీ.పూ 800 సంవత్సరం నుండి దాదాపు క్రీ.శ.12వ శతాబ్దం వరకు కొనసాగింది. పెద్ద పెద్ద రాతి కొండలను తవ్వి గుహలు, అందులో శిల్పాలను చెక్కారు. అజంతా, ఎల్లోరా గుహలన్నింటిలో బౌద్ధ, జైన మతానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఎన్నో కనిపిస్తాయి. వాటిలో ఇక్కడ కనిపించేది ఎల్లోరాలోని 10వ గుహ. ఎల్లోరా మొత్తం గుహల్లో ఇదే పెద్దది, ప్రత్యేకమైనది కూడా. దీన్ని విశ్వకర్మ అనే ఎన్నో శ్రమలకోర్చి దీన్ని తయారు చేశాడని చెప్తారు. మిగతా అన్ని గుహల్లా వుంటే ఈ 10వ గుహ మాత్రం గుడి ఆకారంలో ఎంతో సుందరంగా వుంది. దీనిపై ఎన్నో చిన్నచిన్న శిల్పాలను కూడా చెక్కారు. ఈ నెల 18వ తేదీ అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం సందర్భంగా ఒకసారి మననం చేసుకోవడం మాత్రమే. ఇలాంటివి అంతర్జాతీయంగానే కాదు, మన దేశంలోనే చాలా వున్నాయి. అలాంటి వాటికి ఇదొక మచ్చు తునక.