మనాలి... ఇక్కడి మంచు పర్వతాలను చూసి వయసులో సంబంధం లేకుండా అందరూ చిన్న పిల్లలు అవ్వాల్సిందే ..! చిన్న పిల్లలతో పోటీ పడి మంచులో పెద్దవాళ్ళు ఆడుకుంటుంటే, పెద్దవాళ్ళతో పోటీ పడి పిల్లలు ట్రెక్కింగ్ చేస్తుంటారు. ఆ వాతావరణం, ప్రకృతి దృశ్యాలు చూశాక ప్రతి ఒక్కరికీ ఓపిక, హుషారు వచ్చేస్తుంది. వేసవికాలంలో ఇదో చల్లని సేదతీర్చే ప్రదేశం.