Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బయట పొంచివున్న అవాంఛనీయ పరిస్థితులు, టెక్నాలజీ విప్లవం పుక్కిలించిన మితిమీరిన స్వేచ్ఛ,తల్లిదండ్రుల తీరికలేనితనం, పెంపకానికి సంబంధించి ఉమ్మడికుటుంబాల నెనరు దొరక్కపోవడం, బస్తీల గృహాల్లోని ఇరుకిరుకుతనం, వలసలు, ఉద్యోగ బదిలీలు, స్వస్థలాల్లోని పాఠశాలల నిద్రమోతుతనం ఈ కారణాల వల్ల పిల్లల యోగక్షేమాల పరిరక్షణలో గురుకుల విద్యవైపే అందరి చూపు సారించి ఉన్నది.
ఏ వ్యవస్థ అయినా విజయవంతం కావడానికి దాని రూపురేఖలు, వ్యవస్థాపనా లక్ష్యాలు, పని విధానం, పోటీతత్వం, కాలీన అనుసంధానం, సాధిస్తున్న సత్ఫలితాలు కారణమవుతాయి. ఈ సూత్రం గురుకుల విద్యాలయాలకూ వర్తిస్తుంది. మిగతా పాఠశాలలు కళాశాలలకంటే గురుకులాలు ఎందుకు మెరుగైనవో ఏయే విషయాల్లో ముందంజలో ఉంటాయో కూడా ఇదివరకటి కంటే ఇప్పుడు తల్లిదండ్రులు మిక్కిలి అవగాహన కలిగివున్నారు.అందుకనే ప్రవేశ పరీక్ష నుంచి చేరిక దాకా పేరెంట్స్ పిల్లలవెంట ఉంటున్నారు. ఊళ్లో స్కూలుకు గురుకుల పాఠశాలకూ గల వనరులు, నిర్వహణా పరమైన తేడాలను తల్లిదండ్రులు నిశితంగా పరిశీలిస్తున్నారు. గురుకులమే మేలు అనే సమిష్టి నిర్ణయానికి వస్తున్నారు.
'విద్య వికాస దాయిని' అని గుర్తించిన నేటి సమాజంలో పిల్లల చదువుల గురించిన తల్లిదండ్రుల ఆరాటం అంతా ఇంతా కాదు. ఈ సంఘర్షణలోనే విద్యాసంస్థ, దాని రిపిటెన్సీ, యాజమాన్యం, అధ్యాపకుల వివరాలు, టీచింగ్ లెర్నింగ్ కార్యక్రమాలు మొదలైనవన్నీ చర్చకొస్తాయి. మరీ ముఖ్యంగా విద్యాసంస్థలు అందించే సహకారం, నైపుణ్యాల పెంపు, విద్యార్థులు సాధించిన విజయాలు విద్యా సంస్థ ఖాతాలో చేరతాయి. చదువులో ఆరితేరిన విద్యార్థి గొప్పతనం కంటే, ఆ విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్యాసంస్థకే ఘనతను ఆపాదిస్తున్న సంస్థారాధకులనూ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోంచి ఆలోచించినపుడు సాధారణ పాఠశాలలు కళాశాలలకంటే రెసిడెన్షియల్ స్కూళ్లు కాలేజీల వైపే ఇవాళ తల్లిదండ్రులే కాదు పిల్లలు సైతం మొగ్గు చూపుతున్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లు కాలేజీలను పూర్వకాలం నాటి ఆశ్రమ వ్యవస్థతో పోల్చుతూ గురుకులాలుగా నామకరణమూ చేసుకున్నాం. నిజమే పూర్వం గురువు వద్దకే శిష్యుడు వెళ్లి విద్యాభ్యాసం ముగిసే వరకూ గురువు చెంతనే వుండి శుశ్రూష చేసి గురువు ప్రాపకంతో గుణాత్మక ఫలితాలను అందిపుచ్చుకునేవాడు. అచ్చు ఇప్పుడట్లా కాకపోయినా విద్యాసంవత్సర ఆరంభం మొదలు ముగిసేవరకు పొద్దంతా విద్యాలయంలోనే గడుపుతూ, దాపున్నే హాస్టల్లో మాపు బసచేసే విధానమిప్పుడు విజయవంతమైన విధానంగా కనిపిస్తోంది. సాధారణ విద్యాసంస్థలకూ రెసిడెన్షియల్ సంస్థలకూ పోల్చి చూస్తే ఉత్తీర్ణతతోపాటు నాణ్యమైన విద్య పిల్లలకు అందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందుకు వివిధ సర్వేలు రిపోర్టులు ఇస్తున్న రుజువులూ ఉన్నాయి. Indian School Road, Residential Schools and Indigenous People వంటి విద్యా గ్రంథాలు వక్కాణిస్తున్నాయి.
గురుకుల విధానాన్ని పాశ్చాత్యులు 'కమ్యూనిటీ లివింగ్ అండ్ లెర్నింగ్ (Community living and learning) అని సంబోధిస్తారు. భారతీయ ప్రాచీన విద్యావిధానమైన గురుకుల విధానాన్ని పారిశ్రామిక యుగారంభంలో మొదట కెనడా ఆ తర్వాత ఐరోపా దేశాలు తమ దగ్గర ప్రారంభించు కున్నాయి. పరిశ్రమల్లో పనిచేసే ఆదిమ జాతీయుల పిల్లలను చదివించడానికి క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ స్కూళ్లు అక్కడ వెలిశాయి. పదిహేడో శతాబ్ది చివర్లో పాశ్చాత్యుల్లో అంకురించిన రెసిడెన్షియల్ స్కూళ్ల భావన 1880 కల్లా నిజరూపం దాల్చింది. వందలాది బోర్డింగ్ పాఠశాలలు రూపుదిద్దుకున్నాయి. 'యూరో-కెనడాకల్చర్'గా పిలువబడుతున్న అక్కడి రెసిడెన్షియల్ విద్యావ్యవస్థ క్రమేణా రోమన్ కాథలిక్ చర్చి ఆధ్వర్యంలో మన దేశంలోకి వచ్చి ఆధునిక గురుకుల వ్యవస్థగా అవతరించింది. ఆ తర్వాత మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలూ అణగారిన వర్గాల అభ్యున్నతికై గురుకుల
విద్యాలయాల స్థాపనకు మహదాశయంతో నడుంబిగించాయి .ఐతే గురుకులాలు చర్చి సౌజన్యంతో నడచినా లేదా ప్రభుత్వాల సహకారంతో నడుస్తున్నా తల్లిదండ్రులు అమితంగా ఇష్టపడడానికి స్పష్టమైన కారణాలు ఉన్నాయి. అవి 1. ఒక మంచి పాఠశాల ఏదీ తమ ఆవాసాల్లో లేకపోవడం, 2.ఆవాసంలో ఉన్న పాఠశాల గుణాత్మక విద్యనందిస్తూ విద్యార్థి సమగ్రాభివృద్ధికి పాటుపడే అవకాశం లేకపోవడం, 3. తమ ఇండ్లల్లో కూడా విద్యాభివృద్ధికి సానుకూల వాతావరణం ఉండకపోవడం, 4.కుటుంబాలు వారసత్వంగా వచ్చిన వృత్తుల్లోనే కొనసాగడం మూలాన పిల్లలకు అభ్యసన సహకారాన్ని అందించలేకపోవడం, 5. తమ పిల్లలు బాగా చదువుకొని పెద్ద పెద్ద హోదాల్లో ప్రొఫెషనల్స్‌గా ఎదగుతారనుకోవడం, 6.పిల్లలు కూడా ఇంటి నుంచి దూరాలకు వెళ్లిరావడం కంటే హాస్టల్ వసతినే కోరుకోవడం ఇట్లా పలు కారణాల వల్ల రెసిడెన్షియల్ విధానానికి డిమాండు పెరుగుతూ వచ్చింది. సైనిక పాఠశాలలు మొదలుకొని నవోదయ, కస్తూర్బా, జ్యోతీబాఫూలే విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు యాభైవేలకు పైచిలుకు గురుకుల ఆశ్రమ పద్ధతిలో దేశవ్యాప్తంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. ఇవి ఐఐటి, ఐఐఎస్సీ, నిట్, ఐఐఎం లాంటి అత్యున్నత సంస్థలకూ విద్యావంతులను అందించడం, అఖిల భారత అత్యున్నత సర్వీసులకూ ఇక్కడి విద్యార్థులు పెద్దమొత్తంలో ఎంపిక అవుతుండడంతో రెసిడెన్షియల్ విధానం బహుళ ప్రజాదరణ పొందిగలిగింది.
ఏ వ్యవస్థ అయినా విజయవంతం కావడానికి దాని రూపురేఖలు, వ్యవస్థాపనా లక్ష్యాలు, పని విధానం, పోటీతత్వం, కాలీన అనుసంధానం, సాధిస్తున్న సత్ఫలితాలు కారణమ వుతాయి. ఈ సూత్రం గురుకుల విద్యాలయాలకూ వర్తిస్తుంది. మిగతా పాఠశాలలు కళాశాలలకంటే గురుకులాలు ఎందుకు మెరుగైనవో ఏయే విషయాల్లో ముందంజలో ఉంటాయో కూడా ఇదివరకటి కంటే ఇప్పుడు తల్లిదండ్రులు మిక్కిలి అవగాహన కలిగివున్నారు.అందుకనే ప్రవేశ పరీక్ష నుంచి చేరిక దాకా పేరెంట్స్ పిల్లలవెంట ఉంటున్నారు. ఊళ్లో స్కూలుకు గురుకుల పాఠశాలకూ గల వనరులు, నిర్వహణా పరమైన తేడాలను తల్లిదండ్రులు నిశితంగా పరిశీలిస్తున్నారు. గురుకులమే మేలు అనే సమిష్టి నిర్ణయానికి వస్తున్నారు.ఇందుకు కారణాలు 1. వసతి గృహ సదుపాయం (Boarding facility), 2.ఉన్నత ప్రమాణాలు గల విద్య (High education standards) 3.అభ్యసన శ్రేష్ఠత (Curriculum of choice), 4. క్రమశిక్షణ (Discipline), 5. క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు (Sports, extra- curricular activities), 6.భద్రత (Safety), 7.సానుకూల సామాజిక జీవితం (Positive social life). గురుకు లాల్లోని ఈ ఏడు అంశాలు ప్రస్తుతం తల్లిదండ్రులను అమితంగా ఆకర్షిస్తు న్నాయి. నిజమే, మంచి భోజనం, ఆరోగ్య భరోసా, వ్యక్తిగత భద్రతతో కూడిన సౌకర్యవంతమైన వసతి పిల్లల ప్రాథమి కావసరం. వీటికి తోడు అర్హత అనుభవం నిబద్ధత కలిగిన అధ్యాపకులు,Beit, CBSC, ICSE, IB IGCSE మొదలైన కోర్సులు ఎంపికచేసుకునే అవకాశం ఉండడం, విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన enforcing sense of discipline, ఉదయం 5.30 నుంచి రాత్రి 8.30 వరకు కాలనిర్ణయ పట్టికను అనుసరించే దినసరి షెడ్యూలు విద్యార్థులకు గురుకు లాలు విశేషంగా నచ్చడానికి హేతువులు. దేహ దారుఢ్యం కోసం ప్రేరణకోసం ఆటలు, మనోల్లాసం సృజనా త్మకతను ప్రోత్సహించే సాంస్కృతిక కార్యక్రమాలు, గ్లోబల్ కాంపిటెన్సీకి సరిచేర్చే లైబ్రరీ ఇ-రిసోర్సెస్, విద్యాలయంలో తమతోపాటు చదువుకునే అందరితో సానుకూలంగా మెలగగలిగే సామాజిక అవగాహన విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఎంతగానో కలసివచ్చే అంశాలు.
బయట పొంచివున్న అవాంఛనీయ పరిస్థితులు, టెక్నాలజీ విప్లవం పుక్కిలిం చిన మితిమీరిన స్వేచ్ఛ, తల్లిదండ్రుల తీరికలేనితనం,పెంపకానికి సంబంధించి ఉమ్మడికుటుంబాల నెనరు దొరక్క పోవడం, బస్తీల గృహాల్లోని ఇరుకిరుకు తనం, వలసలు, ఉద్యోగ బదిలీలు, స్వస్థలాల్లోని పాఠశాలల నిద్రమోతుతనం ఈ కారణాల రీత్యా పిల్లల యోగక్షేమాల పరిరక్షణలో గురుకుల విద్యవైపే అందరి చూపు సారించి ఉన్నది. గురుకులాలూ ఆమేరకు లోకల్ స్కూల్స్ కాలేజీలకంటే వైవిధ్యంగా తమ ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్నాయి. ఫలితాలొస్తున్న గురుకులాల మీదే ప్రభుత్వాలూ ఏకాగ్రతను ఇన్వెస్ట్ చేస్తున్నాయి. నిధులను వెచ్చిస్తున్నాయి. మాతృభాషా సొగసును ఒడిసి పట్టు కుంటూనే ఆంగ్ల మాధ్యమంలో అడుగు వర్గాల పిల్లలు అనర్గళంగా మాట్లాడగలు గుతుండడం, ఇన్నోవేటర్స్ గా ఇన్వెంటర్స్ గా రోదసి సందర్శనకు ఎంపిక కావడం,ఎవరెస్టు అధిరోహకులుగా ధైర్యసహసాలు ప్రదర్శిం చడం గురు కులాల విశిష్టతకు అదనపు మెరుపులు. మొత్తం విద్యా వ్యవస్థను గమనించినపుడు విద్యార్థినీ విద్యార్థులకు తప్పని అవసరాలైన enforcing sense of discipline, అందించడంలో రెసిడెన్షియల్ స్కూళ్లు కాలేజీలదే అగ్రస్థానం.సంపన్నుల పిల్లలు చదివే ఇంటర్నేషనల్ స్కూళ్లకు దీటుగా ఇప్పుడు ప్రభుత్వ గురుకులాలు నడుస్తుండటం పేద ప్రజలకు దక్కిన అదృష్టం.ప్రభుత్వ ఆదాయం రాబడి పోబడి ఎట్లా ఉన్నా ఇప్పుడు మండల ప్రాథమిక పాఠశాలలను జిల్లా పరిషత్ స్కూళ్లను క్లస్టర్ కేంద్రంగా బోర్డింగ్ స్కూల్స్ గా పునర్వ్యవస్థీకరించవలసి వున్నది.ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలకు అనుబంధంగా వాటివాటి ప్రాంగణాల్లో వసతి గృహాలను ఏర్పాటుచేయాల్సివుంది.అప్పుడే యావన్మంది గ్రామీణ విద్యార్థులు Transnationalism ను తట్టుకోగలరు.
" Residential schools infuse a heightened sense of discipline in a child. They get to know how to behave where and when a certain degree of decorum is expected out of them. Children get up early on time and follow routine activities as per a fixed schedule. This brings out the best in them and trains them towards a better future. Any child who has studied in a residential school exhibits a certain edge. They also have a superior command over the medium of instruction and it is followed quite strictly. Boarding schools students lead a regimented life"
-- Parents, Saluja Gold International School,
Jharkhand.
-డా|| బెల్లి యాదయ్య, 98483 92690