Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానం గాలిలో భారీ కుదుపునకు గురైంది. దీంతో ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఏడు మంది ప్రయాణికులు గాయపడ్డారు. మంగళవారం ఈ ఘటన జరిగిట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి సిడ్నీ విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత మార్గమధ్యలో ఈ ఘటన జరిగింది. అయితే ప్రయాణికులెవ్వరికీ సీరియస్ గాయాలు కాలేదని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. సిడ్నీ విమానాశ్రయం చేరుకున్న తర్వాత ప్రయాణికులకు వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. హాస్పిటల్లో ఎవర్నీ చేర్పించలేదని డీజీసీఏ వెల్లడించింది.గాయపడ్డ ఏడుగురు ప్రయాణికులకు క్యాబిన్ సిబ్బంది ఫస్ట్ ఎయిడ్ వైద్యం చేయించింది. సిడ్నీలోని ఎయిర్ ఇండియా ఎయిర్పోర్టు మేనేజర్ ప్రయాణికులకు మెడికల్ అసిస్టెంన్స్ అందించారు.