Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 17 నుండి సమ్మె
నవతెలంగాణ-పినపాక
తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధం అవుతున్నమని పీఆర్సి అమలులో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఏప్రిల్ 17వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు దిగాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం మేరకు సమ్మెలో పాల్గొంటున్నట్లు జేఏసీ చైర్మన్ వెంకటేశ్వర్లు (1104 యూనియన్) తెలియజేశారు. గురువారం ఈ బయ్యారంలో గల విద్యుత్ సబ్‌స్టేషన్‌లో కరకగూడెం, మణుగూరు ఉద్యోగులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 1999, 2004 మధ్య నియమించబడిన ఉద్యోగుల కోసం ఈపీఎఫ్‌ను జీపీఎఫ్ సదుపాయంగా మార్చడం, విద్యుత్తు వినియోగాల్లోని చేతివృత్తుల వారి డిమాండ్లపై ప్రతిష్టంభన కొనసాగిందన్నారు. గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ సంఘంపై యాజమాన్యం వైఖరి పట్ల ఉద్యోగులు నిరాశ చెందారని జేఏసీ నాయకులు తెలిపారు. సమ్మెను ఉద్యోగులందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జేఏసీ కన్వీనర్, డీఈ జీవన్ కుమార్, కో చైర్మన్ బి.రామకృష్ణ, జాయింట్ సెక్రెటరీ వెంకటరాజు (సీఐటీయూ), ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం నాయకులు ఉదరు రత్న కుమార్, ఉద్యోగుల సంఘం బీసీ నాయకులు సీతారాములు, ఉద్యోగుల ఓసి అసోసియేషన్ నాయకురాలు, ఈ.బయ్యారం ఏఈ కావ్య, విద్యుత్ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.