Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొక్కజొన్నలు ప్రభుత్వమే మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి
- తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు
నవతెలంగాణ-ఖమ్మం
రబీ సీజన్లో పండిన ధాన్యం కొనుగోలుకు అవసరమైన మిల్లులు కేటాయింపు చేయాలని, మొక్కజొన్నలు మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మం సుందరయ్య భవన్లో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్ అధ్యక్షతన జరిగిన రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ మిల్లులు కేటాయింపు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసినా ఉపయోగం లేదన్నారు. రబీ సీజన్లో పండిన ధాన్యం కొనుగోలుకు మిల్లుల యాజమాన్యంతో ప్రభుత్వం ముందస్తుగా చర్చలు జరిపి, ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల్లో ఉన్న రైస్ మిల్లులకు ధాన్యం తరలించాలన్నారు. అలా కాకుండా శాసనసభ్యులు, జిల్లా అధికారులు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయడం, తర్వాత పది రోజులు అయినా ధాన్యం కాటాలు వేయకపోవడం జరుగుతుందని అన్నారు, మొక్కజొన్న పంట సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయి ఉన్న నేపథ్యంలో మద్దతు ధర కూడా రాకుండా రోజు రోజుకూ మొక్కజొన్న ధర క్వింటాల్‌కు 700 రూపాయలకు పైగా తగ్గిందన్నారు. ప్రభుత్వం వెంటనే మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పెండిరగ్లో ఉన్న రైతుబంధు నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తాతా భాస్కరరావు, రాయల వెంకటేశ్వరరావు, ఎస్ కె మీరా సాహెబ్, బిక్కసాని గంగాధర్, గుడవర్తి నాగేశ్వరరావు, బింగి రమేష్, కూసుపూడి మధు, అర్వపల్లి గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.