Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
నవతెలంగాణ-చుంచుపల్లి
పవిత్ర రంజాన్ పండుగ సందర్బంగా కొత్తగూడెంలోని ముస్లిం జర్నలిస్ట్ సోదరులకు టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు రంజాన్ తోఫాను శుక్రవారం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా సమాజ సేవ చేస్తున్న జర్నలిస్ట్‌లకు ఎంత చేసిన తక్కువే అని అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం జర్నలిస్ట్ సోదరులకు తన వంతుగా రంజాన్ తోఫా అందిస్తున్నట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో జర్నలిస్ట్ సోదరులందరికీ తన వంతుగా అండగా ఉంటానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి పెద్ద పీట వేసిందన్న విషయాన్నీ గుర్తు చేశారు. ఈ రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా ఉపాధ్య క్షులు యండి. కరీంపాషా, ఓబిసి కొత్త గూడెం మండల అధ్యక్షులు జయప్రకాష్, జర్నలిస్ట్ మిత్రులు మహ్మద్ షఫీ, ఖలీమ్, ఎంఏ మాజీద్, ఫయీమ్, అఫ్జల్ పఠాన్, అన్వర్ అలీ, జలీల్, పాషా, షైక్ షఫీ పాల్గొన్నారు.