Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయోద్యమ సమ భావన స్పూర్తి దెబ్బతిన్నది
- ప్రముఖ ప్రజా వైద్యులు డాక్టర్ చీకటి భారవి
నవతెలంగాణ-వైరాటౌన్
ప్రజలను అజ్ఞానంలో ఉంచేందుకు పాలకవర్గం నిత్యం ప్రయత్నం చేస్తుందని, మూఢ విశ్వాసాలను ప్రోత్సహిస్తుందని ప్రముఖ ప్రజా వైద్యులు డాక్టర్ చీకటి భారవి అన్నారు. పాఠ్య పుస్తకాలలో సమాజ పరిణామం శాస్త్రీయ విశ్లేషణ తొలగింపు నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలని అన్నారు. ఆదివారం వైరా బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో జరిగిన వైరా స్టడీ సర్కిల్ లో ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ చీకటి భారవి మాట్లాడుతూ మూఢ విశ్వాసాలు సమాజ రుగ్మత అని అన్నారు. భారత దేశంలో సైన్స్, టెక్నాలజీ కార్పొరేట్ సంస్థల లాభాలకు ఉపయోగపడుతుందని, ప్రజలను అంధ విశ్వాసాల వైపు తిరిగి వెనక్కి తీసుకుపోయి పరిస్థితి దాపురించిందని, జాతీయోద్యమ సమ భావన స్పూర్తి దెబ్బ తింటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, వైరా స్టడీ సర్కిల్ కన్వీనర్ బోడపట్ల రవీందర్, డాక్టర్ పిల్లలమర్రి సుబ్బారావు, సిపిఐ(ఎం) వైరా మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, మాజీ ఎంపిపి బొంతు సమత, పారుపల్లి కృష్ణారావు, మందడపు రామారావు, నారికొండ అమరేందర్, వడ్లమూడి మధు తదితరులు పాల్గొన్నారు.