Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 24న జరుగనున్న నిరుద్యోగ నిరసన ర్యాలీని జయప్రదం చేయండి
- జిల్లా కాంగ్రెస్ నాయకులు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ నున్న రామకృష్ణ
నవతెలంగాణ-పెనుబల్లి
నేడు జరగనున్న నిరుద్యోగ నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు, మాజీ ఆత్మ చైర్మన్ నున్న రామకృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం లంకపల్లి గ్రామంలోని ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపి అధికారం కోసం తహతహలాడుతోందని, ఆ పార్టీని ప్రజలు నమ్మరని అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి పైచౌకబార్ విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తగిన సమయంలో బిజెపికి ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి నాయకత్వంలో తాముముందుకు సాగుతున్నామని, అధిష్టాన నిర్ణయం మేరకు ఎవరికి ఎమ్మెల్యే సీటు ఇచ్చిన పార్టీకి కట్టుబడి పని చేస్తామన్నారు. ఎమ్మెల్యేగా యువకులకు ప్రాధాన్యత కల్పించాలని తాము కోరుకుం టున్నట్టు తెలిపారు. ఈ సమావేశం లో సత్తుపల్లి వ్యవసాయ సహకార సంఘ వైస్ చైర్మన్ గాదె చెన్నకేశవ రావు, కిసాన్ కాంగ్రెస్ మండల వైస్ ప్రెసిడెంట్ పుచ్చకాయల రవి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పొట్లపల్లి వెంకటేశ్వరరావు, కుక్కపల్లి శ్రీను, మామిళ్ళపల్లి సత్యనారాయణ, దార్ల సురేష్, నీలాల గోపి, నరుకుల్ల రవి, బద్దం రాము, గడ కొట్టు వెంకటేశ్వరరావు, బాలాజీ చారి, సవలం వెంకటేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.