Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి వేయాలి
- పెండింగు దళితు బందు యూనిట్లకు నిధులు మంజూరుకు ఆదేశం
- కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-పాల్వంచ
కలెక్టర్ కార్యాలయంలోని అన్ని శాఖల జిల్లా సమయపాలన పాటించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశాలు హాల్లో బయోమెట్రిక్ హాజరు, ఆరోగ్య మహిళా, కంటి వెలుగు, దళిత బంధు, రెండో విడత గొర్రెల పంపిణీ, మున్సిపాలిటీలు గ్రామపంచాయతీలో రీడింగ్ రూములు ఏర్పాటు, తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బయోమెట్రిక్ హాజరులో ఇన్, అవుట్ తప్పనిసరిగా వేయాలని, ప్రతి సోమవారం బయోమెట్రిక్ హాజరు పై సమీక్ష జరుపుతానని తెలిపారు. దాని ఆధారంగానే వేతనాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. మున్సిపాలిటీ హిందూ గ్రామపంచాయతీలో రీడింగ్ రూములు ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలను ఆదేశించారు. అలాగే మున్సిపాలిటీకి ముఖ్యమంత్రి హామీ మేరకు చేపట్టాల్సిన పనులపై అంచన నివేదికలు తయారు చేయాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. ముర్రేడు వాగుపై నిర్మిస్తున్న రెండవ వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, జాతీయ రహదారులు డీఈకి సూచించారు. పెండింగ్‌లో ఉన్న 21 దళిత బంధు యూనిట్లకు నిధులు మంజూరు చేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీని ఆదేశించారు. మున్సిపాలిటీలలో నిర్మించిన వైకుంఠ ధామలకు రామవరంలో నిర్వహించాల్సిన బయో మైనింగ్‌కు విద్యుత్ సౌకర్యం కల్పించాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశించారు. అలాగే రెండో విడత గొర్రెలకు పంపిణీకి ఎంపిక చేసిన లబ్ధిదారుల వాటా చెల్లించు విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపిక చేసిన లబ్ధిదారుల విచారణ ప్రక్రియ లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్ చేయుటకు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆరోగ్య మహిళా కేంద్రాల్లో వైద్య సేవలను సమీక్షించిన కలెక్టర్ ఆరు వారాల్లో 2,635 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. క్యాన్సర్ అనుమానం ఉన్న తొమ్మిది మందిలో నలుగురికి వైద్య పరీక్ష నిర్వహించామని, ఎలాంటి లక్షణాలు లేవని చెప్పారు. మిగిలిన ఐదుగురికి వైద్య పరీక్షలు నిర్వహించి విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య అధికారిని ఆదేశించారు. కంటి వెలుగు కార్యక్రమంలో ఇప్పటికీ వరకు 3382,81 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. రీడింగ్ కంటి అద్దాల అవసరమైన 75,588 మందికి కంటి అద్దాలు పంపిణీ చేసామని, ఫ్రీ సెప్షన్ కంటి అద్దాల అవసరమైన వారికి 14000 కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. 4000 కంటి అద్దాలు పంపిణీ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. 314 గ్రామపంచాయతీలు 96 వార్డుల్లో కంటి వెలుగు క్యాంపులు పూర్తి చేసినట్లు చెప్పారు. భద్రాచలం, సారపాకల్లో కంటి వెలుగు కార్యక్రమానికి కాదనపు టీములను ఏర్పాటు చేయాలని కంటి శాస్త్ర చికిత్స నిర్వహించుటకు జాబితా సిద్ధం చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.